ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మళ్లీ రైలు ప్రయాణ పాట్లు

ABN, First Publish Date - 2023-09-04T00:53:08+05:30

మళ్లీ రైలు ప్రయాణ పాట్లు

ఖాళీగా ఉన్న ప్లాట్‌ఫారం

3ఎకెపిటౌన్‌-4-

3ఎకెపిటౌన్‌-5- ధన్‌బాద్‌ వెళ్లే బొకారో ఎక్స్‌ప్రెస్‌లో జనరల్‌ బోగీలో కిక్కిరిసిన ప్రయాణికులు

3ఎకెపిటౌన్‌-6- బొకారో ఎక్స్‌ప్రెస్‌లో బోగీ గేటు వద్ద పరిస్థితి!

ముఖ్యమైన రైళ్లు పదో తేదీ వరకు రద్దు

భద్రత పనుల కారణంగా అధికారులు నిర్ణయం

ఇతర రైళ్లలో అడుగు పెట్టడానికి వీలుకాని పరిస్థితి

జిల్లా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

తొమ్మిది జతల రైళ్ల రద్దుతో బోసిపోయిన అనకాపల్లి స్టేషన్‌

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 3: జిల్లా వాసులకు రైలు ప్రయాణం రైల్వే శాఖ అధికారుల దయగా మారింది. భద్రతాపరమైన నిర్మాణ పనులు.. ఆటో సిగ్నలింగ్‌.. నాన్‌ ఇంటర్‌ లాక్‌.. ఇంటర్‌ లాక్‌.. ఇలా పలు రకాల పనులతో రెండు నెలల నుంచి తరచూ పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. మరికొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదిస్తున్నారు. తాజాగా ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అనకాపల్లి మీదుగా రాకపోకలు సాగించే జన్మభూమి, రత్నాచల్‌, సింహాద్రి, రాయగడ, మచిలీపట్నం ఎక్‌ప్రెస్‌లు, కాకినాడ, రాజమహేంద్రవరం పాసింజర్‌ రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో అనకాపల్లి జిల్లా నుంచి ఇతర జిల్లాలు/ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతున్నది.

అనకాపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి ఇటు విశాఖ అటు విజయవాడ వైపు నిత్యం పలు రైళ్ల ద్వారా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఉదయం పూట విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, మధ్యాహ్నం రత్నాచల్‌, సాయంత్రం కాకినాడ, రాజమండ్రి పాసింజర్‌, రాత్రి రాయగడ- గుంటూరు రైళ్లకు అధిక డిమాండ్‌ ఉంది. ఈ రైళ్లల్లో రోజూ స్థానికులతోపాటు చోడవరం, మాడుగుల, పాడేరు నియోజకవర్గాలకు చెందిన ప్రయాణికులు రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఈ నెల 10వ తేదీ వరకు ఈ రైళ్లు రద్దు కావడంతో ఉదయం 9.30 గంటలకు వచ్చే టాటా -అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌, మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చే భువనేశ్వర్‌-బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై ఆధారపడాల్సి వస్తున్నది. వీటిల్లో సాధారణ బోగీలు, రెండు మూడుకు మించి లేకపోవడం, అనకాపల్లి వచ్చేటప్పటికే కిక్కిరిసివుండడం, సాధారణ టికెట్లతో రిజర్వేషన్‌ బోగీల్లో ప్రయాణించే వీలు లేకపోవడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించాల్సి వస్తున్నది.

ఇక విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్ల పరిస్థితి చూస్తే ఉదయం పూట మచిలీపట్నం-విశాఖ, గుంటూరు-రాయగడ, కాకినాడ టౌన్‌- విశాఖ, రాజమండ్రి- విశాఖ, మధ్యాహ్నం రత్నాల్‌ ఎక్స్‌ప్రెస్‌, సాయంత్రం జన్మభూమి రైళ్లు అనకాపల్లి ప్రయాణికులకు అత్యంత అలనుకూలంగా వున్నాయి. ఉదయం వేళల్లో ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ఎక్కువగా ఈ రైళ్లలో వెళుతుంటారు. అయితే ఈ నెల పదో తేదీ వరకు ఈ రైళ్లన్నీ రద్దు కావడంతో ఉదయం 6.30 గంటలకు మెయిల్‌, 9.15 గంటలకు తిరుమల, 10 గంటలకు ప్రశాంతి, 11 గంటలకు బొకారో, మధ్యాహ్నం 2.20 గంటలకు కోనార్క్‌, రాత్రి 7.25 గంటలకు ఈస్టుకోస్టు రైళ్లపై ఆధారపడుతున్నారు. వీటిలో తిరుమల మినహా మిగిలిన రైళ్లలో జనరల్‌ బోగీలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ వుండదు.

Updated Date - 2023-09-04T00:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising