ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోచుకున్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు తరలింపు

ABN, First Publish Date - 2023-04-22T00:47:50+05:30

రాష్ట్ర నిధులతో పాటు కేంద్రం నిధులు సైతం పక్కదారి పట్టించి తాడేపల్లి ప్యాలెస్‌ను నింపుకుంటున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.

జి.వెంకటాపురంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాకవరపాలెం, ఏప్రిల్‌ 21 : రాష్ట్ర నిధులతో పాటు కేంద్రం నిధులు సైతం పక్కదారి పట్టించి తాడేపల్లి ప్యాలెస్‌ను నింపుకుంటున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మండలంలోని జి.వెంకటాపురంలో శుక్రవారం రాత్రి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. గతకొన్ని నెల లుగా రాష్ట్రంలో రెండువేల రూపాయల నోట్లు కనిపించకపోవడం, మద్యం షాపుల్లో ఫోన్‌ పే వాడకపోవడం వెనుక ముఖ్యమంత్రి మోసం ఉందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులు చేసేచోట కూలీలకు కనీస సౌకర్యాలు లేవని వాపోయారు. వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్‌.వై. పాత్రుడు, ఎంపీటీసీ సభ్యుడు అప్పలనాయుడు, టీడీపీ నాయకులు అల్లు రామునాయుడు, యర్రంశెట్టి రమణ, జోగిపాత్రుడు, చిరంజీవితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Updated Date - 2023-04-22T00:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising