ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 నుంచి పట్టాలెక్కనున్న వందే భారత్‌

ABN, First Publish Date - 2023-01-12T01:43:28+05:30

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం విశాఖ ప్రజలు ఎంతో కాలం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రానికి ఈ రైలును కేటాయించకపోయినా...తెలంగాణాకు ఇచ్చిన రైలును విశాఖపట్నం వరకు నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అది కూడా ఈ నెల 15వ తేదీ నుంచే ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ నడుమ రాకపోకలు

దూరం 702 కిలోమీటర్లు....ప్రయాణ సమయం 8.40 గంటలు

నాలుగే స్టాపులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం విశాఖ ప్రజలు ఎంతో కాలం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రానికి ఈ రైలును కేటాయించకపోయినా...తెలంగాణాకు ఇచ్చిన రైలును విశాఖపట్నం వరకు నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అది కూడా ఈ నెల 15వ తేదీ నుంచే ప్రారంభం కానుంది.

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు నడపాలనుకున్న ఈ రైలును విశాఖపట్నం వరకు పొడిగించారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ల మధ్య దూరం 702 కిలోమీటర్లు కాగా ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సగటు ప్రయాణ సమయం 12 గంటలు. అదే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అయితే 8.40 గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. దీని వేగం గంటకు 160 కి.మీ. కాగా...83 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

ప్రయాణ సమయాలు

ప్రస్తుతం అందుబాటలో వున్న సమాచారం ప్రకారం ఈ రైలు ప్రతి రోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. రాజమండ్రి 8.10 గంటలకు, విజయవాడ 9.55 గంటలకు, వరంగల్‌ 12.07 గంటలకు, సికింద్రాబాద్‌ మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుతుంది.

అటు సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు వరంగల్‌, రాత్రి 7.10 గంటలకు విజయవాడ, 9.15 గంటలకు రాజమండ్రికి, 11.15 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.

Updated Date - 2023-01-12T01:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising