ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జిందాల్‌తో రహస్య మంతనాలేమిటో!

ABN, Publish Date - Dec 19 , 2023 | 01:41 AM

జిందాల్‌ స్టీల్‌తో జరుగుతున్న రహస్య మంతనాలను స్టీల్‌ప్లాంటు అధికారులు బహిర్గతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

బహిర్గతం చేయాలంటూ ఉక్కు పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌

ఉక్కుటౌన్‌షిప్‌, డిసెంబరు 18:

జిందాల్‌ స్టీల్‌తో జరుగుతున్న రహస్య మంతనాలను స్టీల్‌ప్లాంటు అధికారులు బహిర్గతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. జిందాల్‌తో సమావేశాలను నిరసిస్తూ సోమవారం ఉక్కు పరిపాలనా భవనం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిందాల్‌తో జరిగిన ఒప్పందాలను ఉక్కు యాజమాన్యం బహిర్గతం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఉక్కు సీఎండీ ఢిల్లీలో ఉండి పెద్దల ఆదేశాలతో జిందాల్‌ స్టీల్‌ వ్యవహారాలను చక్కబెడుతున్నారని ఆరోపించారు. ప్లాంటులోకి ఏ ఒక్క ప్రైవేటు సంస్థను రానివ్వబోమని, కర్మాగారం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. ధర్నా కార్యక్రమంలో నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్‌, కేఎస్‌ఎన్‌ రావు, వై.మస్తానప్ప, రమణ, వరసాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 01:41 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising