ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయండి
ABN, First Publish Date - 2023-02-02T23:56:26+05:30
ప్రభుత్వం సూచించిన విధంగా ఉగాదికి ముందే జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో జగనన్న కాలనీల్లో ఇళ్లనిర్మాణాలు, పురోగతి తదితర అంశాలపై సమీ క్షించారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఫిబ్రవరి 2: ప్రభుత్వం సూచించిన విధంగా ఉగాదికి ముందే జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో జగనన్న కాలనీల్లో ఇళ్లనిర్మాణాలు, పురోగతి తదితర అంశాలపై సమీ క్షించారు. విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్ని ఇళ్లు మంజూరు అయ్యాయి ? గ్రౌండ్ అయినవి ఎన్ని ? పూర్తయినవి ఎన్ని అనే అంశా లపై ఆరా తీశారు. జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు ఇసుక, విద్యుత్, నీరు, స్థల వివాదాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు అధి కారులు సహకరించాలని కోరారు. కాలనీల్లోకి వరదనీరు, బిల్డింగ్ మెటీరీయల్ తీసుకెళ్ల డానికి అప్రోచ్‌రోడ్డు తదితర ఇబ్బందులను సచివాలయ ఇంజినీరింగ్ ఆసి స్టెంట్‌లు జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. కొన్నింటికి అక్కడకక్కడే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారిసాతమని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో జడ్పీ సీఈవో అశోక్‌కుమార్, హౌసింగ్ పీడీ రమణమూర్తి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ నాగేశ్వర రావు, ఆర్ డబ్ల్యూఎస్‌ఈ ఉమాశంకర్ , డీపీవో నిర్మలా దేవి, జడ్పీ డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, జిల్లా ఇంజి నీరింగ్ అధి కారులు, సచివాలయ ఇంజినీరింగ్ అ సిస్టెంట్లు పాల్గొన్నారు.
నిర్మాణాలకు సమస్యలెన్నో..
ఫ గంట్యాడ మండలం గోడియాడ గ్రామంలోని జగనన్న కాలనీలో కొన్ని ఇళ్ల నిర్మాణాలకు ఆరు నెలలుగా ల్యాండ్ పొజిషియన్ సర్టిఫికేట్లు ఎందుకు ఇవ్వడంలేదని జడ్పీ చైర్మన్ ప్రశ్నించారు. అయితే ఆయన చెవిలో సంబంధిత ఏవో ఏదో చెప్పారు. దీంతో జడ్పీ చైర్మన్ ‘సరే చూద్దాం’ అన్నారు.. ఇంతకీ ఏఈ ఏమి చెప్పారో సభకు అర్థం కాలేదు. భూ వివాదమే కారణంగా తెలుస్తోంది. ఫ భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం, డెంకాడ మండలం పెదతాడివాడ సమీపంలోని జగనన్న కాలనీల్లో విద్యుత్ , ఇసుక కొరత ఉందని సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తెలిపారు. ఫ బొండపల్లిలోని జగనన్న కాలనీలోకి చెరువు నీరు వస్తుందని, కొత్తవలస మండలంలో కాలనీలోకి అప్రోచ్ రోడ్డులేదని, గృహ నిర్మాణ మెటీరియల్ తీసుకెళ్లలేకపోతున్నట్లు సిబ్బంది జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.
Updated Date - 2023-02-02T23:56:28+05:30 IST