ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN, First Publish Date - 2023-11-29T00:15:04+05:30

మహిళలు, దళితులు, అట్టడుగు వర్గాల స్థితిగతులను మార్చాలని భావించిన పూలే చదువుకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారని కలెక్టర్‌ నాగలక్ష్మి గుర్తుచేశారు. జ్యోతిబా పూలే 133వ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌కు సమీపంలో జ్యోతిబా పూలే కూడలి వద్దనున్న జ్యోతిబా పూలే, సతీమణి సావిత్రీబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలి

కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టరేట్‌, నవంబరు 28: మహిళలు, దళితులు, అట్టడుగు వర్గాల స్థితిగతులను మార్చాలని భావించిన పూలే చదువుకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారని కలెక్టర్‌ నాగలక్ష్మి గుర్తుచేశారు. జ్యోతిబా పూలే 133వ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌కు సమీపంలో జ్యోతిబా పూలే కూడలి వద్దనున్న జ్యోతిబా పూలే, సతీమణి సావిత్రీబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కూడా నివాళి అర్పించారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ పూలే దంపతులు మొదటిగా తన కుటుంబ సభ్యులకు చదువు చెప్పి, తర్వాత ఒక పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకు విద్యను బోధించారని వివరించారు. తద్వార మహిళా సాధికారతకు అనాడే తొలి అడుగు వేశారని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి కిడారి సందీప్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పెంటోజీరావు, బీసీ నాయకులు ముద్డాద మఽధు, రజక, బోయ, బలిజ, కాపు, వెలమ ,మత్య్స కార తదితర కార్పొరేషన్ల డైరక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising