ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్ల వినియోగంతో రైతులకు ప్రయోజనం

ABN, First Publish Date - 2023-01-06T23:46:01+05:30

పురుగు మందు పిచికారీకి కిసాన్‌ డ్రోన్లను వినియోగించడం వల్ల రైతులకు ప్రయోజనం కలగనుందని జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీధర్‌ తెలిపారు.

డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌

అరసవల్లి: పురుగు మందు పిచికారీకి కిసాన్‌ డ్రోన్లను వినియోగించడం వల్ల రైతులకు ప్రయోజనం కలగనుందని జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీధర్‌ తెలిపారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం భైరి గ్రామంలో శుక్రవారం డ్రోన్‌ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మండలానికి 3 గ్రూపుల చొప్పున 90 కిసాన్‌ డ్రోన్లు లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 20 గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ గ్రూపులో ఒక సభ్యుడికి గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో డ్రోన్‌ పైలట్‌ శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రెండు గ్రూపులు శిక్షణ తీసుకున్నాయన్నారు. అనంతరం అపరాల సాగు క్షేత్రంలో డ్రోన్‌ ద్వారా పురుగు మందు పిచికారీ ప్రదర్శన నిర్వహిం చారు. డ్రోన్‌ల వినియోగం ద్వారా ఎకరాకు 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో పంట అంతటికీ ఒకే విధంగా పిచికారీ చేయవచ్చని తెలిపారు. ఖర్చు, సమయం ఆదా అవుతుందన్నారు. పురుగు మందు వినియోగాన్ని 30 శాతం వరకు తగ్గించవచ్చని అన్నారు. జిల్లా వ్యవసాయ సలహామండ లి చైర్మన్‌ నేతాజీ, రాగోలు వరి పరిశోధనా కేంద్రం ప్రిన్సిపాల్‌, సైంటిస్ట్‌ పి.సత్యనారాయణ, ఆత్మ పీడీ, వ్యవసాయ సహాయ సంచాలకులు, అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-06T23:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising