ఆకట్టుకునేలా..
ABN, First Publish Date - 2023-03-01T00:19:29+05:30
భామినిలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
భామినిలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. అనంతరం సైన్స్‌డే అక్షర రూపంలో కూర్చొని అందర్నీ ఆకట్టుకున్నారు. అంతకముందు పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.శివకుమార్ ఆధ్వర్యంలో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మానవ జీవన విధానంలో సైన్స్ ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు దిలీప్‌కుమార్, ఎం.జానకి, వై.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- భామిని
Updated Date - 2023-03-01T00:19:29+05:30 IST