మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ‘మన్యం’
ABN, First Publish Date - 2023-01-04T23:53:07+05:30
మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ‘పార్వతీపురం మన్యం’ను కేంద్ర హోంశాఖ గుర్తించింది.
సాలూరు రూరల్, జనవరి 4: మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ‘పార్వతీపురం మన్యం’ను కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల గుర్తింపును తాజాగా చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాలను గుర్తిస్తూ.. కేంద్రహోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో విజయనగరం మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఉండేది. అయితే జిల్లాల విభజనలో మావోయిస్టు సంచారం విజయనగరంలో లేనట్టయ్యింది. పార్వతీపురం మన్యంలో వారి ప్రభావం ఉండడంతో మావోయిస్టు ప్రభావిత జిల్లాగా కేంద్రప్రభుత్వం గుర్తించింది.
Updated Date - 2023-01-04T23:53:08+05:30 IST