ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి

ABN, First Publish Date - 2023-11-01T00:22:19+05:30

ఉల్లి ధర అమాంతంగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. గత నెలలో కిలో రూ. 30 ఉన్న ఉల్లి ధర అమాంతంగా పెరిగి ప్రస్తుతం రూ.70కి చేరింది. ఈ ధర ఇంకా పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారవర్గాలంటున్నాయి.

ఉల్లి ధర అమాంతంగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. గత నెలలో కిలో రూ. 30 ఉన్న ఉల్లి ధర అమాంతంగా పెరిగి ప్రస్తుతం రూ.70కి చేరింది. ఈ ధర ఇంకా పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారవర్గాలంటున్నాయి. మే, జూన్‌లో రూ. 20కే కిలో ఉల్లి లభ్యమయ్యేది. ప్రస్తుతం ధర పెరగడంతో వినియోగదారులకు భారంగా మారింది. దేశవ్యాప్తంగా ఉల్లిని ఎగుమతి చేసే మహారాష్ట్రంలో వర్షాల వల్ల పంట దిగుబడి లేకపోవడం, వినియోగం పెరగడం, వ్యాపారుల జిమ్మిక్కు తదితర కారణాలు వల్ల ధర పెరుగుతున్నదని పలువురు భావిస్తున్నారు. డిసెంబరు నాటికి ఖరీఫ్‌ ఉల్లి దిగుబడులు వచ్చే వరకు డిమాండ్‌ ఉండవచ్చునని వ్యాపారవర్గాలంటున్నాయి. గతంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు రైతు బజార్లల్లో రాయితీపై విక్రయించారు. ‘పరిస్థితిని బట్టి రాయితీ ఉల్లిని తెప్పించి విక్రయిస్తాం. పార్వతీపురం రైతుబజారులో విక్రయించడానికి ప్రతిపాదనలు చేస్తున్నాం. వీలైతే సాలూరులో రైతు బజారులో అందించడానికి ప్రయత్నిస్తాం. ఇంకా ఉల్లి కోసం ఇండెంట్‌ను పంపలేదు’ అని మార్కెటింగ్‌ ఏడీ ఎల్‌.అశోక్‌ తెలిపారు.
-సాలూరు రూరల్‌

Updated Date - 2023-11-01T00:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising