ఆక్రమణ స్థలంలో స్తంభాల ఏర్పాటుపై నిరసన
ABN, First Publish Date - 2023-03-01T00:15:33+05:30
ముంజేరు పంచాయతీ పరిధిలోగల మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థకు చెందిన స్థలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు ఆక్రమణలను గుర్తించారు.
భోగాపురం: ముంజేరు పంచాయతీ పరిధిలోగల మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థకు చెందిన స్థలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు ఆక్రమణలను గుర్తించారు. ఈ మేరకు మంగళవారం ఆ స్థలంలో సిమెంటు స్తంభాలు ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, ఆ సంస్థ నిర్వాహకులు, ఉద్యోగులు అడ్డుకున్నారు. లోకం ప్రసాదు, నాగమాధవిలకు చెందిన మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ స్థలంలో 293, 296, 337, 393 తదితర సర్వే నెంబర్లలో సుమారు 14.20 ఎకరాలు ఆక్రమణకు గురైన ట్లు ఇటీవల రెవెన్యూ అధికారులు గుర్తించారు. మంగళవారం ఆ స్థలాల్లో సిమెం టు స్తంభాలు పాతేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు సిమెంటు స్తంభాలను ఆటోపై తీసుకొచ్చారు. ఆక్రమణ క్రీడా స్థలంలో పాతడానికి సిద్ధమవుతుండగా, మిరాకిల్ ఉద్యోగులు, విద్యార్థులు మూకుమ్మడిగా వెళ్లి అడ్డుకున్నారు. స్తంభాలను తిరిగి ఆటోలో వేసి, అక్కడ నుంచి పంపించేశారు. రాజకీయ కక్షతోనే ఈవిధంగా చేస్తున్నారని ఆరోపించారు. ముందు చుట్టుపక్కల ఉన్న అన్ని ఆక్రమణలను తొలగించాలని, తర్వాతే ఇక్కడ ఆక్రమణ స్థలంలో స్తంభాలు ఏర్పాటు చేయాలని, లేదంటే ఉద్యమిస్తామన్నారు. దీనిపై ఆర్‌ఐ కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో సిమెంటు స్తంభాలు ఏర్పాటు చేయడాన్ని అడ్డుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు పి.ఉషారాణి, కాళీ, లక్ష్మి, ప్రసన్న, సచివాలయ సర్వేయర్లు కుమార్, గాయత్రి, మిరాకిల్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-01T00:15:33+05:30 IST