సందడిగా దీపావళి
ABN, First Publish Date - 2023-11-13T23:17:01+05:30
జిల్లా ప్రజలు ఆదివారం దీపావళి పండగను సందడిగా జరుపుకొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచే బాంబుల మోత మోగింది.
పార్వతీపురం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలు ఆదివారం దీపావళి పండగను సందడిగా జరుపుకొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచే బాంబుల మోత మోగింది. చిచ్చుబుడ్డీలు, తారాజువ్వల కాంతిలో పల్లెలు, పట్టణాలు దేదీప్యమానంగా కనిపించాయి. కాకరపూవొత్తులు వెలిగిస్తూ చిన్నారులు సందడి చేశారు. ఆకాశాదీపాలను వెలిగిస్తూ మహిళలు కార్తీక మాసానికి ఆహ్వానం పలికారు. రాత్రి 11 గంటల వరకూ ప్రజలు బాణసంచా కాల్చారు. టీడీపీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర స్థానిక జట్టు ఆశ్రమంలో తన కుటుంబ సభ్యులతో దీపావళిని జరుపుకొన్నారు. బాణసంచాలు కాల్చి సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్రచంద్ర మాట్లాడుతూ.. జట్టు ఆశ్రమంలో దీపావళి పండ గను పిల్లలు, పెద్దలు మధ్య నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్ నిశాంత్‌కుమార్‌న్ కలిసి జేసీ గోవిందరావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - 2023-11-13T23:17:03+05:30 IST