ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కష్టపడి పనిచేస్తే మనదే విజయం

ABN, First Publish Date - 2023-08-05T00:37:11+05:30

టీడీపీ శ్రేణులు కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు అన్నారు. శుక్రవారం విజయనగరం నియోజకవర్గ క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాట్లాడుతున్న అశోక్‌ గజపతిరాజు

విజయనగరం రూరల్‌, ఆగస్టు 4: టీడీపీ శ్రేణులు కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు అన్నారు. శుక్రవారం విజయనగరం నియోజకవర్గ క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు తక్కువ మెజార్టీతో ఓడిపోయారని తెలిపారు. ఈసారి శ్రేణులంతా సమష్టిగా పనిచేస్తే ఆమె విజయానికి ఢోకా ఉండదన్నారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ విజయం సాధిస్తే తమ కుటుంబ సభ్యులకు కూడా గ్యారెంటీ ఉండదన్నారు. అంతదారుణంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉంటాయన్నారు. పార్టీ నిర్దేశించిన విధంగా ఓటర్ల నమోదు, బీఎల్వోలతో కలిసి ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం వేగవంతం చేయాలని సూచించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ.. బూత్‌ లెవల్‌ అధికారులతో సమన్వయం చేసుకుని పార్టీ తరఫున ఏజెంట్లు ప్రతి ఇంటికీ వెళ్లాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు. టీడీపీ నగర, మండల అధ్యక్షులు ప్రసాదుల ప్రసాద్‌, బొద్దల నర్సింగరావు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఇంకా 16 రోజుల వ్యవధి మాత్రమే ఉందన్నారు. ఈలోపు ఓటర్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాల్సిన బాధ్యత బీఎల్వోపై ఉందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు విజ్జపు ప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, గంటా పోలినాయుడు, కర్రోతు నర్సింగరావు, కంది మురళీనాయుడు, మైలిపిల్లి పైడిరాజు, కోండ్రు శ్రీనివాసరావు, గంటా రవి, బెవర భరత్‌, పీతల కోదండరామ్‌ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ మాజీ నాయకుడు పేడాడ జనార్దనరావు శుక్రవారం టీడీపీలో చేరారు. అశోక్‌ గజపతిరాజు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

Updated Date - 2023-08-05T00:37:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising