ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CAG : వార్డు సచివాలయాలు రాజ్యాంగ విరుద్ధం

ABN, First Publish Date - 2023-09-26T03:40:01+05:30

రాష్ట్రంలో వార్డు సచివాలయాల ఏర్పాటును కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుబట్టింది. ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని తీవ్రంగా వ్యాఖ్యానించింది. వార్డు సచివాలయాలను రాజ్యాంగబద్ధమైన వార్డు కమిటీలు, ప్రాంతీయ సభలకు

ప్రజాప్రతినిధులకు, పౌరులకు చోటే లేదు: కాగ్‌

ఇది రాజ్యాంగస్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకం

వార్డు కమిటీలకు బదులు సచివాలయాలా?

కమిటీలకు వాటిని జవాబుదారీ చేయాల్సింది

ఆస్తి పన్ను, సిబ్బంది నియామకాల్లో

స్థానిక సంస్థలకు స్వయంప్రతిపత్తి కరువు

సమీక్షా నివేదికలో కాగ్‌ తీవ్ర వ్యాఖ్యలు

అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వార్డు సచివాలయాల ఏర్పాటును కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుబట్టింది. ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని తీవ్రంగా వ్యాఖ్యానించింది. వార్డు సచివాలయాలను రాజ్యాంగబద్ధమైన వార్డు కమిటీలు, ప్రాంతీయ సభలకు జవాబుదారీగా చేసి, రాజ్యాంగంలో ఏకీకృతం చేయాలని వైసీపీ ప్రభుత్వానికి కాగ్‌ సూచించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్‌ నివేదికను సోమవారం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. నివేదికలో కాగ్‌ లేవనెత్తిన అభ్యంతరాల ప్రకారం, రాజ్యాంగపరంగా ఏర్పాటు చేయాల్సిన వార్డు కమిటీలను ప్రభుత్వం విస్మరించింది. దానికిబదులుగా వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అందులో భాగస్వామ్యం లేదు. ఈ చర్య స్థానిక స్వపరిపాలన కోసం ఉద్దేశించిన రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చింది’’ అని కాగ్‌ ఆక్షేపించింది. 2019 జూలైలో జగన్‌ ప్రభుత్వం వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. ఒక్కొక్క వార్డు సచివాలయంలో 10 మంది వార్డు కార్యదర్శుల చొప్పున 37,860 పోస్టులతో ప్రభుత్వం 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న బిల్‌ కలెక్టర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌, ట్యాప్‌ ఇన్స్‌పెక్టర్‌, ఫిట్టర్‌, టీపీ ట్రేసర్‌ పోస్టులను అందులో విలీనం చేశారు. ఇవి మొత్తం 2434 పోస్టులు. అలాగే, 70,888 వలంటీర్లను ఎంపిక చేసింది.

పురపాలక చట్టాల ఉల్లంఘన...

వార్డు స్థాయిలో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయడం పురపాలక చట్టాలకు అనుగుణంగా లేదని కాగ్‌ తీవ్రమైన వ్యాఖ్య చేసింది. ‘‘వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం వల్ల రాజ్యాంగంలో నిర్దేశించినట్టు పౌరులకు, పాలనకు మధ్య వారధిగా ఉండాలనే వార్డు కమిటీ ఉద్దేశాన్ని, రాజ్యాంగ నిబంధనలను జగన్‌ ప్రభుత్వం నీరుగార్చింది. వార్డు కమిటీలు/ప్రాంతీయ సభల లాంటి వ్యవస్థల్లో నిర్దేశించినట్టు ఎన్నికైన ప్రతినిధులు లేదా పౌరసమాజ సభ్యుల భాగస్వామ్యం లేనందున, వాటి ఏర్పాటు ఆమోదయోగ్యం కాదు’’ అని తేల్చింది. స్థానిక అవసరాల కోసం అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడానికి మహానగర ప్రణాళిక కమిటీలు, జిల్లా ప్రణాళిక కమిటీలు ఏర్పాటు చేయాలని కాగ్‌ సూచించింది. ఆస్తి పన్ను వసూలు చేసే అధికారం పట్టణ స్థానిక సంస్థలకు ఉన్నప్పటికీ, పన్నురేట్లు, వాటి సవరణ, వసూలు చేసే విధానం, మినహాయింపులు లాంటి విషయాల్లో నిర్ణయాధికారం ప్రభుత్వం వద్దే ఉందని కాగ్‌ తెలిపింది. ‘‘భవనాలు, ఖాళీ స్థలాలపై ఆస్తి పన్నును సరైన విధంగా మదింపు కోసం అన్ని పట్టణ స్థానిక సంస్థలకు తోడ్పాటు, సాంకేతిక మార్గదర్శకాలను అందించడానికి చట్టం, 13వ ఆర్థిక సంఘం ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఆస్తి పన్ను బోర్డును ఏర్పాటు చేయలేదు. తక్షణమే బోర్డు ఏర్పాటు చేయాలి’’ అని కాగ్‌ సిఫారసు చేసింది.

తణుకు పురపాలక సంఘంలో నాలుగు గ్రామాలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేయగా హైకోర్టు వాటిని కొట్టేసింది. కానీ, ఈ 4 గ్రామాల్లో తణుకు పురపాలక సంఘం పన్నులు వసూలు చేస్తోందని కాగ్‌ తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. మచ్చుకు తనిఖీ చేసిన పట్టణ స్థానిక సంస్థలకు మంజూరైన పోస్టుల్లో 20 శాతం ఖాళీగా ఉన్నాయి. అవసరమైన సిబ్బందిని అంచనా వేసి, నియమించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు అప్పగించాలని కాగ్‌ సిఫారసు చేసింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు 14వ ఆర్థిక సంఘం గ్రాంటును సంబంధిత కాలంలో ఉపయోగించుకోలేదు. గ్రాంట్లను వినియోగించుకోవడానికి కేంద్రం 2022 మార్చి వరకు గడువు పొడిగించినప్పటికీ 2022 మే నాటికి కూడా రూ.275.34 కోట్ల గ్రాంట్లు వినియోగించుకోలేకపోయారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం, పట్టణ స్థానిక సంస్థలకు టైడ్‌ గ్రాంట్‌గా రూ.994 కోట్లను కేటాయించారు. అయితే, ఆర్థిక సంఘం గ్రాంట్లను స్థానిక సంస్థలకు ఆలస్యంగా బదిలీ చేసినందుకు ప్రభుత్వం జరిమానా కట్టకపోవడంతో రూ.497 కోట్లను కేంద్రం విడుదల చేయలేదని ప్రస్తావించింది.

Updated Date - 2023-09-26T03:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising