ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులపై రివర్స్‌ కేసులు పెడతాం

ABN, First Publish Date - 2023-01-06T04:12:36+05:30

జగన్‌రెడ్డి చెప్పాడని నేరాలు చేస్తూ పోతే మీకు జైలు ఖాయం. మా కార్యకర్తలపై దాడిచేసి మాపైనే కేసులు పెడతారా? రివర్స్‌ కేసులు మేమూ పెడతాం జాగ్రత్త’ అని పోలీసులను చంద్రబాబు హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్‌రెడ్డి చెప్పాడని నేరాలు చేస్తూ పోతే మీకు జైలు ఖాయం. మా కార్యకర్తలపై దాడిచేసి మాపైనే కేసులు పెడతారా? రివర్స్‌ కేసులు మేమూ పెడతాం జాగ్రత్త’ అని పోలీసులను చంద్రబాబు హెచ్చరించారు. బుధవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడి కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేతలను గురువారం ఆయన పరామర్శించారు. టీడీపీ శాంతిపురం మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు శ్యామల, పౌలారాణి, హరీశ్‌లకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆస్పత్రి వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఉన్న పోలీసులంతా వచ్చి మా కార్యకర్తలపై దాడిచేయడమే కాకుండా అక్రమంగా మాపైనే హత్యాయత్నం కేసులు పెడతారా? ఈ సైకో ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. మీతో నేరాలు చేయిస్తున్నాడు. నీచబుద్ధి, తప్పుడు ఆలోచనలతో జగన్‌ దిగజారి వ్యవహరిస్తున్నాడు. ఒక సైకో చెప్పాడని మహిళలపై హత్యాయత్నం కేసులు పెడతారా? సాక్షి గుమాస్తా సజ్జలకు ఐపీఎస్‌, ఐఏఎ్‌సలు బానిసలు అయ్యారు’ అని దుయ్యబట్టారు.

నేడు గుడుపల్లెలో పర్యటన

బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించకూడదని ప్రభుత్వం జీవో తెచ్చిన నేపథ్యంలో బుధవారం పోలీసులు శాంతిపురంలో ఆయా కార్యక్రమాలను అడ్డుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన గుడుపల్లె మండలంలో పర్యటించనున్నారు. తాజా ఆంక్షల నేపథ్యంలో గ్రామాల్లో పర్యటనలకే అనుమతి ఉందని పోలీసులు అంటున్నారు.

Updated Date - 2023-01-06T04:12:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising