ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కదం తొక్కిన అంగన్‌వాడీలు

ABN, First Publish Date - 2023-07-11T00:07:39+05:30

సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు కదం తొక్కారు. కలెక్టరేట్‌ వద్ద 36 గంటల ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ వద్ద వంట వార్పుతో నిరసన.. రాత్రి నిద్ర

ఏలూరు రూరల్‌, జూలై 10 : సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు కదం తొక్కారు. కలెక్టరేట్‌ వద్ద 36 గంటల ధర్నా నిర్వహించారు. రాత్రి కలెక్టరేట్‌ వద్దే నిద్రించి, వంట వార్పు చేపట్టి నిరసన తెలిపారు. ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయిలా పోరాడాలని నాయకులు పిలుపు నిచ్చారు. తొలుత ఉదయం జూట్‌మిల్లు వద్ద నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. ధర్నా కు ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.విజయలక్ష్మి అధ్యక్షత వహించగా పలువురు ప్రసంగించారు. ఆర్‌.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్‌, అంగన్‌ వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి భారతి మాట్లాడుతూ పోరాడితేనే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న వాళ్ళను బెదిరించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వాన్ని దించితేనే సమస్యలు పరిష్కా రం అవుతాయన్నారు. మెనూ ఛార్జీ గిట్టుబాటు కాదని, పీఆర్సీ అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఘోరంగా మోసం చేసిందన్నారు. తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతం ఇస్తా మని, మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్‌జీవోస్‌ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి ఎన్‌.రామారావు మాట్లాడారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రమణారావు, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోసమ్మ తదితరులు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు. కార్య క్రమంలో పి.మాణి క్యం, హైమావతి, కుమారి, సరోజని పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-11T00:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising