ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dvarakathirumala: ఆందోళన బాట పట్టిన అన్నదాన సిబ్బంది

ABN, First Publish Date - 2023-01-08T14:24:19+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల (Dvarakathirumala) చిన్న వెంకన్న ఆలయ అన్నదాన భవనంలో పని చేస్తున్న సిబ్బంది (Chinna Venkanna temple staff) ఆందోళన

విధులు బహిష్కరణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల (Dvarakathirumala) చిన్న వెంకన్న ఆలయ అన్నదాన భవనంలో పని చేస్తున్న సిబ్బంది (Chinna Venkanna temple staff) ఆందోళన బాట పట్టారు. అధికారుల తీరు నిరసిస్తూ విధులు బహిష్కరించారు. సుమారు 10 సంవత్సరాల పైబడి అన్నదాన భవనంలో సేవలు అందిస్తున్నా తమను పక్కనపెట్టి కొత్తగా వచ్చిన ఔట్ సోర్సింగ్ (Outsourcing) సిబ్బందికి జీతాలు పెంచడం అన్యాయమని వాపోయారు. అయితే ఇటీవల దేవస్థానం అన్నదానం వడ్డించే కాంట్రాక్ట్ (contract) విజయవాడ (Vijayawada)కు చెందిన వ్యక్తికి అప్పగించింది. అదే కాంట్రాక్టర్‌కు ప్రసాదాల తయారీ మరియు గోశాల (Goshala)కు సంబంధించిన కొన్ని కాంట్రాక్టులు అప్పగించారు. కాంట్రాక్టర్‌తో ఆలయ ఈవో కుమ్మక్కై లబ్ది చేకుస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంతేగాక ప్రసాదాల తయారీ కాంట్రాక్టును సబ్‌లీజ్‌కు ఇచ్చిన సరే ఈవో స్పందించడం పోవడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంతేకాక ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌తో గతంలో ఆలయంలో పనిచేసిన ఈవో సుబ్బారెడ్డికి తారాస్థాయిలో గొడవలు జరిగాయి. కానీ సుబ్బారెడ్డి బదిలీ అనంతరం సదరు విజయవాడ కాంట్రాక్టర్‌కు ఈవో త్రినాధరావు (EO Trinadha Rao) పెద్దపేట వేసి అన్ని రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నారని ఆలయ వర్గాల్లోనే చర్చ జోరుగా సాగుతుంది.

Updated Date - 2023-01-08T14:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising