టిడ్కో గృహాలను ఇవ్వండి..
ABN, First Publish Date - 2023-04-17T00:21:57+05:30
టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ పేదలకు నిర్మించిన టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు అందించా లని టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణ (చంటి) డిమాండ్ చేశారు.
బడేటి చంటి 12 గంటల నిరసన దీక్ష
ఏలూరు టూటౌన్, ఏప్రిల్ 16 : టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ పేదలకు నిర్మించిన టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు అందించా లని టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణ (చంటి) డిమాండ్ చేశారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని బడేటి చంటి 12 గంటల పాటు పోణంగిలోని గృహాల వద్ద నిరసన దీక్ష చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో 6500 టిడ్కో గృహాల పనులు 90 శాతం పూర్తి చేశామన్నారు. లబ్ధిదారుల వాటా కట్టించి అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా ఇంత వరకు లబ్ధిదారులకు ఇళ్లను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి ఎక్కడ పేరు వస్తుందోనని వైసీపీ నాయకులకు భయం పట్టుకుంద న్నారు. జగనన్న ఇళ్లకు రూ.నాలుగు న్నర లక్షలు కేటాయించి పూర్తి చేయాలన్నారు. వచ్చే ఎన్నికల లోపు టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించేలా తాను పోరాటం చేస్తానని, అందించకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. కాగా సాయంత్రం మాజీ ఎంపీ మాగంటి బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు దీక్ష శిబిరాన్ని సందర్శించి చంటికి నిమ్మరసం అందించి దీక్షను విరమింప జేశారు. కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్, డివిజన్ ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-17T00:21:57+05:30 IST