గిరిజనుల ఆదాయాలపై కేంద్ర బృందం సర్వే
ABN, First Publish Date - 2023-04-02T00:36:31+05:30
అటవీ హక్కుల చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్) ద్వారా పోడు భూములు పొందిన గిరిజనుల ఆదాయాలపై మేహపాత్రో ఆధ్వర్యంలో కేంద్ర బృందం సభ్యులు శనివారం కామయ్యకుంటలో సర్వే చేసింది.
బుట్టాయగూడెం, ఏప్రిల్ 1 : అటవీ హక్కుల చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్) ద్వారా పోడు భూములు పొందిన గిరిజనుల ఆదాయాలపై మేహపాత్రో ఆధ్వర్యంలో కేంద్ర బృందం సభ్యులు శనివారం కామయ్యకుంటలో సర్వే చేసింది. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీలో ఎంతమందికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌లో ఎన్ని ఎకరాల భూములు, పట్టాలు ఇచ్చారు అనే విషయాలను దేశవ్యాప్తంగా సర్వేలో భాగంగా ఇక్కడ చేశారు. పట్టాలు పొందినవారు భూములను సాగు చేస్తున్నారా ? ఇతరులకు కౌలుకు ఇచ్చారా ? అసలు వ్యవసాయాలు సాగుచేయడం లేదా ? అనే విష యాలను తెలుసుకున్నారు. ఏఏ పంటలు సాగు చేస్తున్నారు ? ఉమ్మడిగా సాగు చేస్తున్నారా? వ్యక్తిగతంగా సాగు చేస్తున్నారా ఆదాయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను లబ్ధిదారులను స్వయంగా అడిగి తెలుసుకు న్నారు. పంటల సాగుతో లబ్ధిదారులు ఆదాయం ఎంతమేర పొందు తున్నారు? కష్టానికి తగిన ఫలితాన్ని పొందగలుగుతున్నారా అన్న విష యాలపై సర్వే చేశారు. పోడుభూములకు సాగునీటి సౌకర్యాలు ఉన్నాయా ? అధికారులు ఏర్పాటు చేశారా ? లేదా అనే విషయాలను తెలుసుకున్నారు. చాలా మంది గిరిజన రైతులు తమకు వ్యవసాయ బోర్లు లేదా సోలార్ బోర్లు ఏర్పాటు చేయాలని బృందం దృష్టికి తెచ్చారు. ఆర్‌డీవో ఎం.ఝాన్సీ రాణి, ఏపీవో పీవీఎస్ నాయుడు, వెలుగు ఏపీడీ నాగేశ్వరావు, ఎఫ్‌ఆర్‌వో కృష్ణకుమారి తహసీల్దార్ ఎస్.శారాశాంతి, ఆర్‌ఐ లక్ష్మీ, సర్పంచ్ పెడకం విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-02T00:36:31+05:30 IST