Eluru: వైభవంగా ప్రారంభమైన చిన వెంకన్న కళ్యాణం
ABN, First Publish Date - 2023-10-27T07:43:01+05:30
ఏలూరు: ద్వారకా తిరుమల చిన వెంకన్న కళ్యాణం శుక్రవారం ఉదయం అంగరంగా వైభవంగా ప్రారంభం అయింది. ఈ సందర్బంగా స్వామివార్లకు ప్రభుత్వం తరఫున హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఏలూరు: ద్వారకా తిరుమల చిన వెంకన్న కళ్యాణం శుక్రవారం ఉదయం అంగరంగా వైభవంగా ప్రారంభం అయింది. ఈ సందర్బంగా స్వామివార్లకు ప్రభుత్వం తరఫున హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బోర్డు సభ్యులు మేక శేషుబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
కాగా ద్వారకాతిరుమలలో 4వ రోజు శుక్రవారం అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణ అలంకరణలో చిన వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరు. ఈరోజు రాత్రి 7 గంటలకు రథోత్సవం జరగనుంది.
కాగా.. ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 29 వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 28న మధ్యాహ్నం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు. 29వతేదీ ఉదయం ఆలయం తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం జరగనుంది. ఉత్సవాల సమయంలో ఆలయంలో స్వామి వారికి జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేసినట్లు ప్రకటించారు.
Updated Date - 2023-10-27T08:22:28+05:30 IST