ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాది నాటికి లక్ష్యాలు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2023-03-11T23:46:53+05:30

జిల్లాలో పేదలందరికి ఇళ్ల పథకం కింద ఉగాది నాటికి నిర్ధేశించిన లక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ఆదేశం

ఏలూరు కలెక్టరేట్‌, మార్చి 11 : జిల్లాలో పేదలందరికి ఇళ్ల పథకం కింద ఉగాది నాటికి నిర్ధేశించిన లక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పేదలందరికి ఇళ్లు కార్యక్రమం ప్రగతిలో వెనుకబడ్డ మండలాల అధికారులతో ప్రత్యేకంగా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలు కార్యక్రమంలో పేదలందరికి ఇళ్లు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని లబ్ధిదారులకు తెలిపి ఇళ్ల నిర్మాణ ప్రగతిని మరింత పెంచాలన్నారు. ఈ కార్యక్రమం అమలులో అధికారులు, సిబ్బంది అలసత్వం వీడాలన్నారు. లక్ష్యాన్ని సాధించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూజివీడు, మండవల్లి, ఆగిరిపల్లి, కలిదిండి, కైకలూరుల్లో పేదలందరికీ ఇళ్ల పథకం ప్రగతి తక్కువగా ఉందని అన్నారు. డీఆర్వో ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, గృహనిర్మాణశాఖ పీడీ వేణుగోపాల్‌, మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-11T23:46:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising