పట్టు వదలని పోరాటం
ABN, Publish Date - Dec 16 , 2023 | 12:36 AM
సమస్యలు పరిష్కరించండి. ఇచ్చిన హామీలను నెర వేర్చండి. వేతనాలు పెంచండి అంటూ అంగన్‌వాడీ కార్య కర్తలు నిర్వహిస్తున్న సమ్మెపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదు.సమ్మె చేస్తే ప్రభుత్వానికి పోయేదేమీ లేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
అంగన్‌వాడీల సమ్మె ఉధృతం
ప్రత్యామ్నాయమంటూ ప్రభుత్వం హడావుడి
సచివాలయాలకు బాధ్యతల అప్పగింత
పలుచోట్ల తెరచుకున్న కేంద్రాలు
కానీ పిల్లలు మాత్రం లేరు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
సమస్యలు పరిష్కరించండి. ఇచ్చిన హామీలను నెర వేర్చండి. వేతనాలు పెంచండి అంటూ అంగన్‌వాడీ కార్య కర్తలు నిర్వహిస్తున్న సమ్మెపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదు.సమ్మె చేస్తే ప్రభుత్వానికి పోయేదేమీ లేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడినా సరే పట్టించుకోలేదు. తీరా సచి వాలయ సిబ్బందితో తెరిచేందుకు సన్నాహాలు చేసింది. సమీప పాఠశాలలకు, సచివాల యాలకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. దాంతో శుక్రవారం జిల్లాలో పలు కేంద్రాలను సచివాలయ సిబ్బంది తెరి చారు. తాళాలు పగుళగొట్టారు. కొన్నిచోట్ల కేంద్రాలను పరి శీలించి వెళ్లిపోయారు. ఉండి, ఆచంట తదితర ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక నాయకులు, యూటీఎఫ్ నేతలు అంగన్‌వాడీ కేంద్రాలను తెరవకుండా అడ్డుతగిలారు. తెరిచిన కేంద్రాల్లోనూ విద్యార్థులు లేరు. జిల్లా వ్యాప్తంగా ఏ కేంద్రానికి పిల్లలు రాలేదు. ఇళ్లకే పరిమితమయ్యారు. పిల్లలు వచ్చినట్టయితే మధ్యాహ్న భోజనం సమీప పాఠశాలలను తెచ్చిపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. లేదంటే వలంటీర్లు వంటచేసి పెట్టాలని సూచించింది. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల బాధ్యతను అప్పగించడంతో సచివాలయ సిబ్బంది కూడా లబోదిబో మంటున్నారు. ఇదేమీ బాధ్యత అంటూ తలలు పట్టుకుంటు న్నారు. పిల్లలు వస్తే వారిని సరిగా చూడలేక ఇబ్బందులు పడుతామంటూ వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సచి వాలయ సిబ్బంది కూడా అసంతృప్తి గురవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాము నిర్వహించే బాధ్యతలను వివరిస్తూ ప్రభుత్వ నిర్ణయంపై సెటైర్‌లను ట్రోల్ చేస్తు న్నారు. ఇదే ఇప్పుడు జనంలో చర్చనీయాంశంగా మారింది.
పట్టువీడని అంగన్‌వాడీలు
సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ సిబ్బంది పట్టు బిగిస్తున్నారు. వేతనం వదులుకొని సమ్మెకు దిగారు. కనీస వేతనం రూ.26 వేలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు పదవీ విరమణ ప్రయో జనాన్ని రూజ 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తు న్నారు. మూడు నెలల నుంచి వేతనాలు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. కనీసం దానిపైనా ప్రభుత్వం స్పందించ లేదు. మరోవైపు పిల్లలకు నర్సరీ నుంచే విద్యను అందించా లంటూ ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. అంతే తప్పా పిల్ల లను అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషిస్తూ, గర్భిణులకు పౌష్టికా హారం, ఇతర సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలపై మాత్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఫలితంగా జిల్లాలో 1556 అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. తెరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వడం లేదు.సచివాలయ సిబ్బందిలో ఇది అసంతృప్తికి దారితీస్తోంది. తెరచుకున్నాసరే పిల్లలు మాత్రం కేంద్రాలకు రావడం లేదు.మొత్తంపైన అంగన్‌వాడీ సిబ్బంది సమ్మెబాట పడితే ప్రభుత్వం భగ్రం చేసే కుయుక్తులు పన్నుతోంది.
Updated Date - Dec 16 , 2023 | 12:36 AM