ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్రకారుడు వెంపటాపునకు ప్రశంసా పురస్కారం

ABN, First Publish Date - 2023-04-10T00:29:04+05:30

నేషనల్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌లో ప్రముఖ చిత్ర కారుడు వెంపటాపునకు ప్రశంసా పురస్కారం లభించింది.

వెంపటాపును అభినందిస్తున్న మండలి బుద్ధప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తణుకు, ఏప్రిల్‌ 9: నేషనల్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌లో ప్రముఖ చిత్ర కారుడు వెంపటాపునకు ప్రశంసా పురస్కారం లభించింది. విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో కొలుసు ఆర్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడు, కేరళ, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 మంది చిత్రకారులు వివిధ శైలులో చిత్రీకరించిన చిత్రాలు ప్రదర్శించారు. దానిలో ‘వెంపటాపు ఇన్‌ మెడిటేషన్‌’ శీర్షికతో కాంటెం పరరీ శైలిలో చిత్రీకరించిన పెయింటింగ్‌ను ప్రదర్శించి ప్రముఖులు ప్రశంసలు అందుకున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, కొలుసు ఆర్ట్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ కొలుసు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వెంపటాపును దుశ్సాలువా, ప్రశంసాపత్రంతోపాటు జ్ఞాపిక అందించి సన్మానించారు. జాతీయ స్థాయిలో చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్న వెంపటాపు తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. హెచ్‌ఎం ప్రసాదు, ఉమా, జి.జె.ప్రభువరం, కనకదుర్గేశ్వరి, వీరభద్రం తదితరులు ఆయనను అభినందించారు.

Updated Date - 2023-04-10T00:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising