ఘనంగా గంగానమ్మ సంబరాలు
ABN, First Publish Date - 2023-10-09T00:04:25+05:30
స్థానిక 35, 40 డివిజన్లలో గంగానమ్మ ఆలయం వద్ద ఆదివారం సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఏలూరు కార్పొరేషన్, అక్టోబరు 8: స్థానిక 35, 40 డివిజన్లలో గంగానమ్మ ఆలయం వద్ద ఆదివారం సంబరాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి చెందిన యువతులు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సంబరాలకు సందడి నెలకొంది.
గంగానమ్మ జాతర ఏర్పాట్లపై పోలీసుల పరిశీలన
ఏలూరు క్రైం: గానుగులపేటలో గంగానమ్మ జాతర ఏర్పాటర్లను ఎస్‌ఐ శుభశేఖర్ ఆదివారం పరిశీలించారు. జాతర నిర్వాహకులతో ఆయన మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూ లైన్ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. భక్తుల విలువైన వస్తువులను రక్షణ కల్పించాలని, ఎవరైనా అనుమానంగా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నా రు. ఎలాంటి తోపుడు జరుగకుండా కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని కమిటీ వారికి సూచించారు.
Updated Date - 2023-10-09T00:04:25+05:30 IST