వింత వాతావరణం
ABN, First Publish Date - 2023-04-18T23:59:15+05:30
నాలుగు రోజులుగా ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతు న్నారు. ఉదయం 6 గంటలకే సూర్యుడు భగభగమంటూ మండిపోతున్నాడు. అయితే మంగళవారం దీనికి భిన్నమైన వాతావరణం కనిపించింది.
ఉదయం కమ్మేసిన మంచు
మధ్యాహ్నం భానుడి ప్రతాపం
నరసాపురం/పాలకొల్లు అర్బన్/మొగల్తూరు ఏప్రిల్ 18: నాలుగు రోజులుగా ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతు న్నారు. ఉదయం 6 గంటలకే సూర్యుడు భగభగమంటూ మండిపోతున్నాడు. అయితే మంగళవారం దీనికి భిన్నమైన వాతావరణం కనిపించింది. ఉదయం 9 గంటలైనా భానుడు దర్శనమివ్వ లేదు. పొగ మంచు కప్పేసింది. చాలామంది శీతకాలామా లేక వేసవా అన్న డైలమాలో పడ్డారు. మంచు కమ్మేయడంతో నరసాపురం– సఖినేటిపల్లి రేవు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 216 జాతీయ రహదారిపై కూడా ఇదే పరిస్థితి కనిపించింది. పాలకొల్లు, మొగల్తూరు తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి..ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకూ మంచుతో నిండిపోయింది. లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణాలు సాగించారు. 10 దాటిన తర్వాత నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. వేడిగాలులు వీయడంతో ప్రధాన రహదారులు నిర్మానుషంగా మారాయి. మామిడి ఫలసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మొగల్తూరు రైతులు ఆందోళన చెందారు.
Updated Date - 2023-04-18T23:59:15+05:30 IST