ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి నత్తా రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దర్శనం

ABN, First Publish Date - 2023-04-21T00:17:22+05:30

పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం రామలింగేశ్వరస్వామి శుక్రవారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగొండ, ఏప్రిల్‌ 20: పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం రామలింగేశ్వరస్వామి శుక్రవారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సంవత్సరంలో 11 నెలలపాటు నీటిలోనే ఉండి వైశాఖ మాసంలో భక్తులకు దర్శనం ఇస్తారు. పరశురాముడు క్షత్రియలను సంహరించినపుడు ఆ దోష పరిహారార్థం ఇక్కడ గోస్తనీ నదీతీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఏడుకోట్ల మునులు, దేవ రుషులతో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో దీనికి సప్త కోటీశ్వర లింగమని పేరు. ఇక్కడ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం విశిష్టత. చెరువులోని నీటిని తోడివేసి ఈ నెలరోజులూ స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవో శ్రీధర్‌ తెలిపారు. సోమవారం, పర్వదినాల్లో భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2023-04-21T00:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising