రైతును ఆదుకోండి

ABN, First Publish Date - 2023-05-08T00:04:03+05:30

అకాల వర్షంతో తడిచి ముద్దయ్యి సర్వం కో ల్పోయిన రైతాంగాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు.

రైతును ఆదుకోండి
భీమడోలు మండలంలో ధాన్యం పరిశీలిస్తున్న గన్ని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ, రైతు సంఘాలు, వామపక్షాల డిమాండ్‌

రైతులతో మాట్లాడి నష్టంపై ఆరా

జంగారెడ్డిగూడెం టౌన్‌, మే 7: అకాల వర్షంతో తడిచి ముద్దయ్యి సర్వం కో ల్పోయిన రైతాంగాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు. పేరంపేట, పంగిడిగూ డెం గ్రామాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణతో కలిసి దాసరి శ్యామ్‌చంద్రశేషు తడిచిన ధాన్యాన్ని ఆదివారం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని, తడిచిన, మొలకెత్తిన ధాన్యం, మొక్కజొన్న ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులు పంది రామ్‌ ప్రసా ద్‌, పడాల చిన నాగేశ్వరరావు, పోక వీర రాఘవులు మాట్లాడుతూ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాలతో నష్టపోయిన రైతులను మంత్రి కారుమూరి కించపరుస్తూ మాట్లా డడంపై టీడీపీ నేత పెనుమర్తి రామ్‌కుమార్‌ అభ్యంతరం తెలిపారు. ధాన్యం తడిసి మొలకలు వచ్చి నష్ట పోయిన రైతులు మంత్రి కారూమూరికి చెప్పుకోవ డానికి వస్తే బూతులు మాట్లాడతారా? ఇదేనా మీకు రైతులపై ఉన్న చితశుద్ధి అంటూ మండిపడ్డారు. రైతులకు మంత్రి క్షమాపణ చెప్పాలన్నారు.

ఏలూరు టూటౌన్‌: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణచైతన్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. పది రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో జిల్లాలో వరి, మొక్కజొన్న, మిర్చి, మామి డి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఒక్క అధికారి కూడా నష్టపోయిన పొలాలను పరిశీలించిన దాఖలాలు లేకపోవడం దుర్మార్గమన్నారు. గోనె సంచులు సరఫరా చేయ్యని కారణంగానే పంట తడిచిపోయిందన్నారు.

కొయ్యలగూడెం: వర్షాలకు నష్టపోయిన మొక్కజొన్న రైతులను ఆదుకో వాలని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ అన్నారు. గవరవరంలో పాడైన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఎకరాకు రూ. 25వేలు పరిహారం ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో టీడీపీ రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంద న్నారు. టీడీపీ నాయకులు యాగంటి హరిబాబు, నల్లూరి గోపి పాల్గొన్నారు.

భీమడోలు: మొద్దు ప్రభుత్వం తట్లిలేపినా లేవని పరిస్ధితిగా తయారైం దని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కన్వీనర్‌ గన్ని వీరాంజనేయులు అన్నారు. మం డలంలో తడిచినఽ ధాన్యాన్ని పరిశీలించి తహసీల్దార్‌ దృష్టికి తీసుకు వెళ్లడంతో అంబరుపేటలో సంచులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

రైతులను అవమానించిన మంత్రి కారుమూరి క్షమాపణ చెప్పాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. భీమడోలులో రైతులకు సంచులు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు ఆర్‌.లింగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-08T00:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising