పాలిసెట్‌కు438 మంది గైర్హాజరు
ABN, First Publish Date - 2023-05-11T00:28:36+05:30
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు బుధ వారం ఏలూరులోని ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఏపీ పాలిసెట్– 2023 పరీక్షకు మొత్తం 88.2శాతం మంది బాల బాలికలు హాజరయ్యారు.
ఏలూరు ఎడ్యుకేషన్, మే 10 : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు బుధ వారం ఏలూరులోని ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఏపీ పాలిసెట్– 2023 పరీక్షకు మొత్తం 88.2శాతం మంది బాల బాలికలు హాజరయ్యారు. ఈ పరీక్షకు 3,715 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 3,277 మంది హాజరు కాగా 438 మంది గైర్హాజరైనట్టు కోఆర్డినేటర్ పి.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కోఆర్డినేటర్ అక్కినేని శివకుమార్ తెలిపారు. హాజరైన వారిలో 2,078 మంది బాలురు, 1,199 మంది బాలికలు ఉన్నారు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమైనా అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో సహా ఆయా కేంద్రాలకు ఉదయం 8 గంటలకే చేరుకోవడం ప్రారంభమైంది. ఎండల తీవ్రతకు చెమటో డ్చారు. సీఆర్‌ఆర్ డిగ్రీకళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ సందర్శించారు. జవాబు పత్రాలను మూల్యాంకన నిమిత్తం మంగళగిరి తరలించారు. ఫలితాలు ఈ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉంది. అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయగా, ప్రత్యేక స్క్వాడ్‌బృందాలు తనిఖీలు చేశాయి.
Updated Date - 2023-05-11T00:28:36+05:30 IST