ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్రాంతి సంబరం

ABN, First Publish Date - 2023-01-13T23:49:26+05:30

జిల్లాలో ఉద్యోగులు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

మెప్మా ఆధ్వర్యంలో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు టూ టౌన్‌, డిసెంబరు 13: జిల్లాలో ఉద్యోగులు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మెప్మా ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద శుక్రవారం సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం గా జరిగాయి. కార్యాలయ ఆవరణలో భోగా మంట వేసి సందడి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ముగ్గులు పోటీలు, పిల్లలకు ఫ్యాన్సీ డ్రస్‌, డ్యాన్స్‌ పోటీలు నిర్వహించారు. ెుప్మా పీడీ ఇమ్మానియేలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్‌ గుడిదే శ్రీనివాసరావు, కోఅప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, టీఎల్‌ఏ ప్రెసిడెంట్‌ లక్ష్మీశారద, స్వయం సహాయక సంఘాల సిబ్బంది, ఆర్‌పీలు, పాల్గొన్నారు.

ఏలూరు ఎడ్యుకేషన్‌: ఏలూరులోని ఖజానా కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. ట్రెజరీ ఉద్యోగులు, అధికారులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. ట్రెజరీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కృష్ణ ఉద్యోగులకు పండుగశుబాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సర్వీ సులకు సంబంధించి పెండింగ్‌ అంశాలను వెంటనే పూర్తి చేస్తున్నట్టు ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, ముగ్గుల పోటోలను నిర్వహించి విజేతలకు ట్రెజరీ ఆఫీసర్‌ పేమావతి బహుమతులు అందజేశారు. ట్రెజరీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి కె.సత్యనారాయణ, కోశాదికారి ఎన్‌.గణేశ్వరరావు, కార్యాలయ ఏవో టి.భారతి, ఉప ఖజానా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-13T23:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising