హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయండి
ABN, First Publish Date - 2023-05-18T23:52:22+05:30
తాడినాడ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న బిరుదుగడ్డ శేఖర్ దారుణ హత్యకు గురికావటంతో అతడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ గురువారం కలిదిండిలో దళితులు ధర్నా నిర్వహించారు.
కలిదిండి, మే 18 : తాడినాడ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న బిరుదుగడ్డ శేఖర్ దారుణ హత్యకు గురికావటంతో అతడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ గురువారం కలిదిండిలో దళితులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. హత్యకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ గోవర్థన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉధృతంగా ఉండటంతో ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, సీఐ నాయుడు, ఎమ్మెల్యే దూలం నాగే శ్వరరావు ఘటన స్థలాన్ని సందర్శించి డిమాండ్లను అడిగి తెలసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి ఆర్థిక సహకారమందిస్తామ న్నారు. నిందితులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవటం జరుగుతుందని డీఎస్పీ హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు. బోడిగడ్డ కిషోర్, బల్లరాజు, జోజిబాబు, పద్మారావు, సీయోను, సురేష్, క్రాంతి, బస్వారాజ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-05-18T23:52:22+05:30 IST