క్షయ నివారణపై అవగాహన ర్యాలీ

ABN, First Publish Date - 2023-03-24T23:34:55+05:30

క్షయ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాళ్ళ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ గులాబ్‌రాజ్‌కుమార్‌ అన్నారు.

క్షయ నివారణపై అవగాహన ర్యాలీ
కాళ్ళ పీహెచ్‌సీ వద్ద ప్రదర్శన నిర్వహిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కాళ్ళ, మార్చి 24 : క్షయ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాళ్ళ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ గులాబ్‌రాజ్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినం సందర్భంగా కాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ిసీహెచ్‌వో విజయావతి, ఎంపీహెచ్‌ఈవో పాల్సన్‌, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

పాలకోడేరు: ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినంలో భాగంగా విస్సాకోడేరు గ్రామంలో గ్రామ ప్రజలకు క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య సిబ్బంది టీబీని అంతంచేద్దాం, టీబీని సమాజం నుంచి తరిమేద్దాం అని ర్యాలీలో నినాదాలు చేశారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్లు కేఏ శ్రీనివాస్‌, నాగమణెమ్మ, లలిత, వాణి, హెల్త్‌ అసిస్టెంట్‌ వైఎస్‌ఆర్‌ గోపాలకృష్ణ, ఏఎన్‌ఎంలు హేమలత, భవాని పాల్గొన్నారు.

Updated Date - 2023-03-24T23:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising