ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chintamaneni: జగన్.. మీ తాత దిగొచ్చినా ఏం చేయలేరు...

ABN, First Publish Date - 2023-01-02T16:08:28+05:30

ఏలూరు: టీడీపీ (TDP) సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌ (Chintamaneni Prabhakar) పట్ల పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: టీడీపీ (TDP) సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌ (Chintamaneni Prabhakar) పట్ల పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist.) పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) టీడీపీ నేతలందరినీ టార్గెట్ (Target) చేసిందన్నారు. ఇతర రాజకీయ నేతలు

ఎవరైనా మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను, చేతగానితనాన్ని ప్రశ్నించినా.. విమర్శించినా.. వాళ్ల పరిస్థితి కూడా చింతమనేనిలా ఉంటుందని చెప్పేందుకే తనను టార్గెట్ చేసిందని అన్నారు. టీడీపీ 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అని.. అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజాక్షేత్రంలో కొట్లాడుతున్న పార్టీ అని అన్నారు. ‘నువ్వు కాదు.. నీ తాత దిగొచ్చినా’ టీడీపీని ఏమీ చేయలేరని సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. రేపు అధికారంలోకి రాబోయేది టీడీపీయేనని చింతమనేని ప్రబాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌ సోమవారం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. రేపు తన పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు చింతమనేని తన అనుచరులతో ఆస్పత్రికి వచ్చారు. అయితే హరిరామజోగయ్య (Chegondi Venkata Harirama Jogaiah)ను పరామర్శించేందుకే ఆస్పత్రికి వచ్చారన్న అనుమానంతో లోపలకు వెళ్లకుండా గేటు దగ్గరే పోలీసులు నిలువరించి అనుచితంగా వ్యవహరించారు. దీంతో చింతమనేని వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చింతమనేనిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విడిచిపెట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ అమరావతి కేంద్ర టీడీపీ పార్టీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలియజేశారు. బర్త్ డే సందర్భంగా దెందులూరులో చింతమనేని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లను అడ్డుకున్న పోలీసులు చింతమనేని చొక్కా చించివేశారు. పోలీసుల తీరుపై చింతమనేని మండిపడ్డారు.

Updated Date - 2023-01-02T16:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising