ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravathi: సీఎం సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నేత

ABN, First Publish Date - 2023-02-13T12:23:08+05:30

అమరావతి (తాడేపల్లి): ఏలూరు జిల్లా, కైకలూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (తాడేపల్లి): ఏలూరు జిల్లా, కైకలూరు టీడీపీ నేత (TDP Leader), మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ (Jaya Mangala Venkataramana) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)లో చేరారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సమక్షంలో చేరారు. వెంకటరమణను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageswararao) మధ్యవర్తిత్వంతో ఆయన పార్టీలో చేరారు. ప్రస్తుతం జయమంగళ వెంకట రమణ కైకలూరు టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు.

కాగా జయమంగళ వెంకట రమణకు ఎమ్మెల్సీ (MLC) పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయనకు నలుగురు గన్‌మెన్‌లను ప్రభుత్వం కేటాయించింది. స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న 8 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీసీ వర్గానికి చెందిన వెంకట రమణకు కేటాయించారు.

జయ మంగళ వెంకటరమణ ఆసుపత్రిలో ఉండగా మంత్రి కారుమురు నాగేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ మంత్రి కారుమూరు హామీ ఇచ్చారు. దీంతో డైలమాలో పడ్డా జై మంగళ వెంకటరమణ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలను సంప్రదించి... వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2023-02-13T12:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising