ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెరిగిన పేదరికం

ABN, First Publish Date - 2023-06-22T00:58:31+05:30

వైసీపీ పాలనలో ఏపీలో పేదరికం పెరిగింది. సీఎం జగన్‌, ఆయన మంత్రి వర్గ సహ చరులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని నిలువునా దోచేశారు. చేతగాని పాలన మూలంగా ధనికులు మరింత ధనికులు అవుతుంటే, పేదలు నిరుపేదలుగా మారిపోయారు’

సమావేశంలో మాట్లాడుతున్న యనమల రామకృష్ణుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ పాలనలో ఏపీలో బాగుపడింది

జగన్‌ అండ్‌ కో మాత్రమే

పేదరిక నిర్మూలనకే టీడీపీ సూపర్‌ సిక్స్‌ మానిఫెస్టో.. చైతన్య రథయాత్రలో

మాజీ మంత్రి యనమల

ఏలూరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి):‘వైసీపీ పాలనలో ఏపీలో పేదరికం పెరిగింది. సీఎం జగన్‌, ఆయన మంత్రి వర్గ సహ చరులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని నిలువునా దోచేశారు. చేతగాని పాలన మూలంగా ధనికులు మరింత ధనికులు అవుతుంటే, పేదలు నిరుపేదలుగా మారిపోయారు’ అంటూ టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రచారంలో భాగంగా ‘చైతన్య రథ యాత్ర’ను ఏలూరులో బుధవారం నిర్వహించారు. నగరం లో బస్సు యాత్ర నిర్వహించి 11వ డివిజన్లో రచ్చబండ జరిపారు. టీడీపీ పాలనలో ఏలూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, పథకాల అమలుపై నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణ(చంటి) వివరించారు. ముఖ్య అతిథి యనమల మాట్లాడుతూ... ‘పేదరిక నిర్మూలన కోసమే టీడీపీ సూపర్‌ సిక్స్‌ మినీ మేనిఫెస్టో ప్రకటించింది. సమాజంలో యువత, మహిళలు, రైతుల ఆర్థిక ప్రగతి కోసం ఈ మినీ మేనిఫెస్టోలో పెద్దపీట వేశాం. వైసీపీ పాలనలో కొత్త పరిశ్రమలు, కంపె నీలు రాకపోవడమేగాక ఉన్నవి కాస్తా పక్క రాష్ట్రాలకు తరలి పోవడం వల్ల యువత నిరుద్యోగంతో అల్లాడుతున్నారు. మన రాష్ట్ర యువత ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోవా ల్సిన కర్మ పట్టింది. టీడీపీ పాలనలో నిరుద్యోగ యువతకు నెలకు రూ.2,500 భృతి ఇవ్వగా, 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. వైసీపీ పాలనలో ఫిష్‌ స్టాల్స్‌, మటన్‌ షాపుల ఉద్యోగాలే దక్కాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేల భృతిని నిరుద్యోగులకు, రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలి స్తాం. రాష్ట్రంలో దోచుకున్న సొమ్మంతా జగన్‌ ఇడుపుల పాయలో దాచుకున్నారు. అందుకే రూ.2 వేల నోట్ల రద్దుకు టీడీపీ ప్రతిపాదించింది. ఎన్నికల్లో ధన ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే పేదలు నిరుపేదలైపోతారు. పేదలు ధనికులుగా మారాలంటే మళ్లీ బాబే సీఎం కావాలి. ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి’ అంటూ ఆయన కోరారు.

ప్రజా సమస్యలు గాలికి...

మాజీ మంత్రి, టీడీపీ జోన్‌–2 కో–ఆర్డినేటర్‌ పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా అరాచకాలు, అత్యాచారాలు, హత్యలే రాజ్యమేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌కు సీఎంగా ఉండే అర్హతే లేదని, వైసీపీ ప్రభుత్వంలో పేదోడి గురించి ఆలోచించే నాయకులే లేరన్నా రు. నిత్యావసర సరుకులు, కరెంట్‌, ఆర్జీసీ చార్జీలతో పాటు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా బడేటి బుజ్జి అందించిన సేవలను గుర్తుచేశారు. బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని రక్షించే నాయకుడు చంద్రబాబేనన్నారు. మాజీ మంత్రి పీతల సుజాత, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేశ్‌, ఘంటా మురళీ, జడ్పీ మాజీ చైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-22T00:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising