ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-06-04T00:46:43+05:30

వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.

పోలీస్‌స్టేషన్‌లో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం క్రైం, జూన్‌ 3 : వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించి స్ధానికులు తెలిపిన వివరాలు ప్రకారం వీరవాసరం గ్రామానికి చెందిన బండారు మణికంఠ అనే యువకుడు వైసీపీ నాయకులపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టడంతో వైసీపీ కార్యకర్తలు వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మణికంఠను పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకొని పోలీసులతో మాట్లాడారు. అనంతరం అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు చినబాబుతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరిపి అక్కడ నుంచి పంపించేశారు.

Updated Date - 2023-06-04T00:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising