ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టమోత.. మోగింది

ABN, First Publish Date - 2023-06-28T00:08:57+05:30

ఎండలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూరగాయల ధరలు మాత్రం మండుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనలేం.. తినలేం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెంచరీ దాటిన టమోట

అల్లం కేజీ రూ.250

అదే దారిలో మిగిలిన కూరగాయలు

ఏలూరుటూటౌన్‌, జూన్‌ 27: ఎండలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూరగాయల ధరలు మాత్రం మండుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనలేం.. తినలేం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగినప్పటికి తప్పనిసరిగా కూరగాయలు కొనాల్సిందే. కూరగాయలు లేనిదే రోజు గడవదు. అందుకే పావుకేజీలు, అరకేజీలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీరోజు కూరల్లో టమోటాలు ఉండాల్సిందే. టమోటాలు లేకుండా కూర రుచి ఉండదు. చాలా తక్కువ టమోటాలు వినియోగించి భోజనాలు ముగించాల్సి వస్తుంది. నిన్నా మొన్నటి వరకు మండే ఎండలతో కూరగాయాలు పంటలన్నీ ఎండిపోయాయి. దిగుబడులు తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇది చాలదు అన్నట్లు దళారులు ఇదే అదునుగా అగ్నికి ఆజ్యం పోసినట్టు మరింతగా ధరలు పెంచేశారు. దీంతో కొన్ని కూరగాయల ధరలు కేజీ ధర సెంచరీ దాటాయి. ముఖ్యంగా టమోటాలు బహిరంగ మార్కెట్‌లో రూ.100 దాటిపోయాయి. టమోటాతో పాటు బీన్స్‌, చిక్కుడు, పచ్చిమిర్చి కూడా సెంచరీ దిశగా నమోదు చేసుకుంటున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కాకర కాయలు రూ.70, బీరకాయలు రూ.60లు, బెండకాయలు, వంకాయలు కేజీ రూ.40లు పలుకుతున్నాయి. క్యాప్సికం కూడా రూ.90పైబడే అమ్ముతున్నారు. దొండకాయలు రూ.30, బంగాళదుంప రూ.30, గోరుచిక్కుడు రూ.60 చేమదుంపలు రూ.55లు, కంద రూ.56, పలుకుతున్నాయి. అల్లం ఏకంగా రూ. 250లకు చేరుకుంది. కీర దోసకాయ రూ.60, క్యారెట్‌ రూ.40, బీట్‌రూట్‌ రూ.45 ధర పలుకుతున్నాయి.

రైతు బజారులో అమ్మకాలు (కేజీ)

కూరగాయలు వారం క్రితం ధర ప్రస్తుత ధర

టమోటా 40 75

చిక్కుడు 70 90

పచ్చిమిర్చి 76 94

వంకాయలు 25 30

కాకరకాయలు 76 94

గోరుచిక్కుడు 40 48

ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

కూరగాయల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. మరోవైపు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యుడు కుదేలయ్యాడు. ఈ పరిస్థితుల్లో కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి కూరగాయల ధరలును సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి

పి.ఆదికేశవ్‌, వినియోగదారుడు పత్తేబాద, ఏలూరు

కొత్త పంటలు వచ్చే వరకు తప్పదు..

తొల కరి వర్షాలు కురవ డంతో రైతులు పంటలు వేస్తున్నారు. ఇవన్నీ దిగుబడులు వచ్చేసరికి కనీసం నెలరోజులు పడుతుంది. నెలరోజుల వరకు అటూ ఇటుగా కూరగాయల ధరలు హెచ్చుగా కొనసాగే అవకాశం ఉంది.

సుధాకర్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌ రైతు బజారు, పత్తేబాద

Updated Date - 2023-06-28T00:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising