ఆ ఇళ్ల స్థలాలు మాకొద్దు
ABN, First Publish Date - 2023-07-21T00:26:32+05:30
గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సంధ్యపు వాగు వద్ద జిగురు భూముల్లో కేటాయించిన నివేశనా స్థలాల్లోకి మేం వెళ్లం, గ్రామం దగ్గర్లో నివాసాలకు అమోదయో గ్యంగా ఉన్న ఇళ్ల స్థలాలను ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు అధికారులను నిలదీశారు.
ముసునూరు, జూలై 20: గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సంధ్యపు వాగు వద్ద జిగురు భూముల్లో కేటాయించిన నివేశనా స్థలాల్లోకి మేం వెళ్లం, గ్రామం దగ్గర్లో నివాసాలకు అమోదయో గ్యంగా ఉన్న ఇళ్ల స్థలాలను ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. సచివా లయం –1 పరిధిలో గురువారం జరిగిన సురక్ష గ్రామసభ జరిగింది. అనేక సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నివాసాలకు ఆమోదయోగ్యంగా లేని భూమిని కొనుగోలు చేసి ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చారని.. అవి మాకొద్దని లిఖితపూర్వకంగా అధికారులకు ఇవ్వడం జరిగిందని, సబ్‌కలెక్టర్ ఆదర్ష్‌రాజీంద్రన్ కూడా గ్రామంలోనే నివే శనా స్థలాలకు అనువైన భూమిని త్వరితగతిన కేటా యించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినా, నేటికి ఆ ప్రక్రియ ఎందుకు పూర్తి కాలేదని లబ్ధిదారులు ప్రశ్నించారు. కొత్త చెరువు నుంచి బైళ్లుకు 300 ఎకరాలు వ్యవసాయ భూము ల్లోకి వెళ్లేందుకు ఉన్న రహదారి ఆక్రమణకు గురైం దని, ఆక్రమణలు తొలగించి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు తహసీల్దార్‌కు వివరించారు.
సమస్యలపై స్పందించిన తహసీల్దార్ దాసరి సుధ మాట్లాడుతూ, ఇళ్లస్థలాల భూకేటాయింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు. రహదారిని సర్వేచేసి పంట పొలాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫేజ్ –2 లో అధికారుల ఆదేశాల మేరకు 33 మంది గృహాలు నిర్మించుకున్నా నేటికి బిల్లులు చెల్లింపులు జరగలేదని, అప్పులు చేశామనీ, వెంటనే బిల్లులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవా లంటూ లబ్ధిదారులు వాపోయారు. ఇన్‌చార్జ్ హౌసింగ్ ఏఈ బోట్ల శివ మాట్లాడుతూ, విడతలవారీగా బిల్లు చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. 618 మందికి ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. విజయలక్ష్మి యిర్మియా, కృష్ణకుమారి, లక్ష్మి, జి.రాణి, నాగవల్లేశ్వర రావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T00:27:02+05:30 IST