ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశలపై నీళ్లు

ABN, First Publish Date - 2023-02-03T00:25:55+05:30

కొంత కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఆక్వా రైతులకు కేంద్ర బడ్జెట్‌లో నేరుగా లబ్ధి కలిగించే ప్రకటన లేకపోవడంతో ఆ రంగంలో కాస్త నిరాశ వ్యక్తం అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేతల తయారీదారులకు కస్టమ్స్‌ సుంకం తగ్గింపు..

వెంటనే మేత ధర తగ్గితేనే రైతుకు ప్రయోజనం

భీమవరం, ఫిబ్రవరి 2 : కొంత కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఆక్వా రైతులకు కేంద్ర బడ్జెట్‌లో నేరుగా లబ్ధి కలిగించే ప్రకటన లేకపోవడంతో ఆ రంగంలో కాస్త నిరాశ వ్యక్తం అవుతోంది. ఆక్వా నుంచిఏటా 60 వేల కోట్ల వరకు విదేశీ ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ రంగానికి సంబంధించి వివిధ రకాల పథకాలు అమలులో ఉన్నా నేరుగా సాగు చేసే రైతుకు ప్రయోజనం కలిగించే పథకాలు లేకుండా పోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో కాస్త నిరాశ కనిపించింది. మేతల తయారీదారులకు మాత్రం కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల మేత ధరలు తగ్గే అవకాశం ఉంది. మేతల తయారీకి ఉపయోగించే ఫిష్‌ మిల్లుపై ఇంత వరకు 15 శాతం డ్యూటీ విధిస్తున్నారు. దీనిని ఐదు శాతం తగ్గిస్తూ నిర్ణయించారు. అలాగే క్రిల్‌మీల్‌ కూడా 15 నుంచి ఐదు శాతం తగ్గించారు. ఫిష్‌ లిపిడ్‌ ఆయిల్‌పై ఇంత వరకు 30 శాతం పన్ను వసూలు చేస్తుంటే దాన్ని 15 శాతానికి తగ్గించారు. ఇతర మెడిసిన్స్‌లో వాడే మెటీరియల్‌ పైనా 50 శాతం వరకు తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య యోజన పథకానికి ప్రకటించిన రూ.6000 కోట్లు కేటాయింపుల ద్వారా మత్స్యకార కుటుంబాలకు సంబంధించి ఉపాధిని పెంచడానికి ప్రయోజనం కలిగిస్తుంది. ఇదేరీతిలో తమకు ఉపయోగపడే పథకాలను అమలు చేయాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.

ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలి

ఇటీవల ఆక్వా రంగం వ్యాపారం కొంత సంక్షోభంలో పడింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆక్వా రంగానికి ప్రత్యేకించి రైతులకు కేటాయింపులు లేవు. మేతల తయారీ ఇంగ్రిడియంట్స్‌లో పన్నులు తగ్గించడం మంచి పరిణామం. రూ.6000 కోట్లు ప్రకటన మత్స్యకార రంగానికి ఎంతో ఉపయోగపడుతుంది. మేత ధరలను తగ్గించడానికి చర్యలు చేపడితే రైతులకు ఉపయోగం.

భీమాల శ్రీరామమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా ట్రేడర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ, భీమవరం

ఆక్వా రైతుకు ప్రయోజనం ఎక్కడ..?

కేంద్ర బడ్జెట్‌లో ఆక్వా రైతులకు నేరుగా లబ్ధి కలిగించే విధంగా పథకాలు ప్రకటించలేదు. మేతల తయారీకి ఉపయోగించే మెటీరియల్‌పై కేంద్ర పన్ను తగ్గించారు. ఈ లబ్ధి ఆ సంస్థలకు అందు తుంది. వెంటనే మేతల ధరలు తగ్గిస్తే రైతులకు ఉపయోగం.

– జీకేఎఫ్‌ సుబ్బరాజు, ఏపీ ఆక్వా రైతుల సంక్షేమ సంఘం ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ

Updated Date - 2023-02-03T00:25:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising