ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలం..గరళం

ABN, First Publish Date - 2023-03-12T23:46:13+05:30

మొగల్తూరు ప్రధాన కాల్వ కలుషిత కోరల్లో చిక్కుకుంది. నిడదవోలు నుంచి వచ్చే ఈ ప్రధాన కాల్వకు మొగల్తూరు శివారు ప్రాంతం. ఇక్కడ మిగులు నీరు లాకు నుంచి ఉప్పుటేరులో కలుస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మొగల్తూరు ప్రధాన కాల్వ కలుషితం

పేరుకుపోయిన తూడు, చెత్తా చెదారాలు

మృత కళేబరాలతో దుర్వాసన

మంచినీటి ప్రాజెక్టు చెరువులకు ఇదే నీరు మళ్లింపు

రోగాల బారిన పడుతున్న తీర గ్రామాల ప్రజలు

మొగల్తూరు, మార్చి 12 : మొగల్తూరు ప్రధాన కాల్వ కలుషిత కోరల్లో చిక్కుకుంది. నిడదవోలు నుంచి వచ్చే ఈ ప్రధాన కాల్వకు మొగల్తూరు శివారు ప్రాంతం. ఇక్కడ మిగులు నీరు లాకు నుంచి ఉప్పుటేరులో కలుస్తుంది. నిత్యం ఎగువ ప్రాంతాల నుంచి గుర్రపు డెక్క, తూడు, జంతు, మానవ మృత కళేబరాలు శివారున ఉన్న మొగల్తూరుకు వచ్చి నిల్వ ఉండిపోతున్నాయి. ప్రధాన కాల్వలో నీటి ఎద్దడితో మొగల్తూరు లాకు తలుపులు తెరవడం లేదు. ఫలితంగా కాల్వలో నిల్వ ఉన్న చెత్తా చెదారాల్లో జంతు, మృత కళేబరాలు నిల్వ ఉండి దుర్వానస రావడంతో ప్రయాణికులు, కాల్వ గట్టున నివాసం ఉండే నివాసితులు భరించలేక పోతున్నారు.

ప్రక్షాళనకు నోచుకోని కాల్వ

మొగల్తూరు ప్రధాన కాల్వను అనుకుని ఉన్న తీర గ్రామాల్లో సాగు, తాగునీటి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే గత ఐదేళ్లుగా ఈ కాల్వ ప్రక్షాళనకు నోచుకోలేదు. కాలువ అధునికీకరణ పనులు చేసిన సమయంలో శివారు ప్రాంతంపై పాలకులు దృష్టి సారించకపోవడంతో చుక్క నీరు రావాలంటే గగనంగా మారింది.

మంచినీటి చెరువులకు ఇదే కాల్వ నీరు

తీరంలోని మొగల్తూరు, కేపీపాలెం, తూర్పుతాళ్ళుల్లోని బృహత్తర మంచినీటి ప్రాజెక్టు చెరువులకు ఇదే నీటిని లిఫ్ట్‌ చేస్తున్నారు. అయితే తూడు మృత కళేబరాలతో కలుషితమైన నీటిని మంచినీటి చెరువులకు లిఫ్ట్‌ చేయడం వల్ల ఆ నీటిని తాగుతున్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాల్వ ఎగువ ప్రాంతాల్లో పర్యవేక్షణ లేకపోవడం వల్లే శివారుకు చెత్తా చెదారాలు, మృత కళేబరాలు వస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో నీటి పారుదల శాఖాధికారులు కనీసం ఆయా లాకుల వద్ద పర్యవేక్షణ చేసి ప్రత్యేక సిబ్బందితో చెత్త రాకుండా అక్కడే తొలగించేలా చర్యలు తీసుకోవాలని శివారు ప్రాంత ప్రజలు, రైతులు కోరుతున్నారు.

దుర్వాసన భరించలేకపోతున్నాం..

మొగల్తూరు ప్రధాన కాల్వలో మృత కళేబరాలు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తోంది. కాల్వ పరిసరాల్లో తిరగాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ముందెన్నడూ చూడలేదు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కాల్వలను శుభ్రపరిచే చర్యలు చేపట్టాలి.

– దూది ముర్తిరాజు, మొగల్తూరు

కాలుష్య నివారణ చేపట్టాలి

కాలుష్య కోరల్లో చిక్కుకున్న మొగల్తూరు ప్రధాన కాల్వలను ప్రక్షాళన చేయాలి. ఇదే నీటిని మంచినీటి చెరువులకు తోడుతున్నందున ప్రజల ఆరోగ్యాలపై ప్రమాదం చూపే అవకాశం ఉంది. తీర గ్రామాల ప్రజారోగ్యం, రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని శివారుకు కాలుష్యం రాకుండా చర్యలు తీసుకోవాలి.

– మామిడిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌, మొగల్తూరు.

–––––––

Updated Date - 2023-03-12T23:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising