CM Jagan: పొటాటోని తెలుగులో ఏమంటారన్న జగన్.. ముక్కున వేలేసుకున్న అధికారులు
ABN, First Publish Date - 2023-12-08T13:34:38+05:30
సీఎం జగన్ ఆలుగడ్డ... ఉల్లిగడ్డ వ్యాఖ్యలపై సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ కు వీటి మధ్య తేడా కూడా తెలియదా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. పొటాటోను తెలుగులో ఏమంటారు అంటూ అధికారులను జగన్ అడగటంతో వారంతా ముక్కున వేలేసుకున్నారు.
అమరావతి: సీఎం జగన్ ఆలుగడ్డ... ఉల్లిగడ్డ వ్యాఖ్యలపై సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ కు వీటి మధ్య తేడా కూడా తెలియదా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. పొటాటోను తెలుగులో ఏమంటారు అంటూ అధికారులను జగన్ అడగటంతో వారంతా ముక్కున వేలేసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తుపాను సహయం కోసం తిరుపతి జిల్లా వాకాడు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం ఆలుగడ్డ, ఉల్లిగడ్డ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
భాదితులతో ఏర్పాటు చేసిన సభలో సీఎం వ్యాఖ్యలతో జనం ఖంగుతిన్నారు. రేషన్ వివరాలు వెల్లడిస్తూ కేజి ఆనియన్, కేజి ఉల్లిగడ్డ అని జగన్ వ్యాఖ్యానించారు. పొటాటోని ఉల్లిగడ్డే అంటారుగా అంటూ అధికారులను సీఎం ప్రశ్నించారు. సీఎంకు ఏమంటారో తెలియకపోవడంతో బంగాళదుంప అంటారంటూ అక్కడికి వచ్చిన జనం చెప్పారు. చివరకు అధికారులను పోటాటోను ఏమంటారు అని అడిగి బంగాళ...దుంప... అంటూ పొడిపొడిగా జగన్ చెప్పారు. దీంతో ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం అంటూ సోషల్ మీడియాలో వెంటనే సెటైర్లు ప్రారంభమయ్యాయి.
Updated Date - 2023-12-08T14:44:32+05:30 IST