మధ్యాహ్న భోజనంలో పురుగులు
ABN, First Publish Date - 2023-07-11T05:46:46+05:30
కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సోమవారం వడ్డించిన మధ్యాహ్న భోజనంలో తెల్లపురుగు,
కృష్ణా జిల్లా బిళ్లపాడు పాఠశాలలో ఘటన
గుడివాడ, జూలై 10: కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సోమవారం వడ్డించిన మధ్యాహ్న భోజనంలో తెల్లపురుగు, పెంకి పురుగులు కన్పించాయి. దీంతో విద్యార్థులు భోజనం చేయకుండా, పస్తులతో గడపాల్సి వచ్చింది. ఈ స్కూలుకు రోజూ అక్షయపాత్ర సంస్థ నుంచి కాంట్రాక్టర్ మధ్యాహ్న భోజనం పంపిస్తారు. అయితే విద్యార్థులో భోజనం వద్ద కూర్చొన్నాక.. అన్నంలో తెల్ల పురుగులు ఎక్కువగా కన్పించడంతో ప్రధానోపాధ్యాయుడు బి.ఎ్‌స.నాగేశ్వరరావు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి విద్యార్థులను భోజనం చేయనీయకుండా ఆపివేసి ఇళ్లకు పంపించేశారు. ఇలాంటి భోజనమా వడ్డించేది అంటూ కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకువచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు
Updated Date - 2023-07-11T05:46:46+05:30 IST