ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంటిపై వైసీపీ జెండా కట్టాల్సిందే..!

ABN, First Publish Date - 2023-11-17T04:17:34+05:30

ప్రజలకు ఇష్టమున్నా, లేకపోయినా వారి ఇళ్లపై వైసీపీ జెండా ఎగరాల్సిందేనని, ప్రభుత్వ ఉద్యోగి అయినా, కూలీలైనా, మరెవరైనా సరే జెండా కట్టి తీరాల్సిందేనని వలంటీర్లు ద్వారా ఆ పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు.

జగన్‌కు పది మార్కులు వేయాల్సిందే

లేదంటే పథకాలు కట్‌ చేస్తాం.. వలంటీర్లతో బెదిరింపులు

బుక్కరాయసముద్రం, నవంబరు 16: ప్రజలకు ఇష్టమున్నా, లేకపోయినా వారి ఇళ్లపై వైసీపీ జెండా ఎగరాల్సిందేనని, ప్రభుత్వ ఉద్యోగి అయినా, కూలీలైనా, మరెవరైనా సరే జెండా కట్టి తీరాల్సిందేనని వలంటీర్లు ద్వారా ఆ పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. లేకపోతే ప్రభుత్వం నుంచి అందే పథకాలను కట్‌ చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఈ తతంగం సాగుతోంది. వలంటీర్లు తమ పరిధిలో ఉన్న 50 ఇళ్లకు వెళ్లి జెండాలు కట్టిస్తున్నారు. ‘చంద్రబాబు అమలు చేసిన పథకాలు ఎలా ఉన్నాయి? జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలు ఎలా ఉన్నాయి?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్షలో జగన్‌కు పదికి పది మార్కులు, చంద్రబాబుకు సున్నా మార్కులు వేయకపోతే పథకాలు రావని కొందరు గ్రామ వలంటీర్లు బెదిరింపులకు దిగుతున్నారు. చివరగా జగన్‌ పరిపాలన బాగుందని ఆ ఇంట్లోవారితో చెప్పించి, అందుకు సాక్ష్యంగా ఓ సెల్ఫీదిగి.. వైసీపీ నాయకుల వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. పైగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని చెప్పేందుకు ఓ స్టాంపును కూడా తయారుచేయించారు. ‘ఆపు బాబూ నాటకం.. జగనే మా నమ్మకం’ అనే స్టాంపు వేసి, సంతకం చేసి మరీ వలంటీర్లకు ఇవ్వాలి. ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారో, లేదో తెలుసుకోవడానికి వలంటీర్లతో ఇలా బలవంతపు సర్వే చేయిస్తున్నారు. దీనికోసం మండలానికో కన్వీనర్‌ను వైసీపీ ఏర్పాటు చేసింది. చాలామంది వలంటీర్లు ఇష్టం లేకుండానే ఈ సర్వేలో పాల్గొని, సెల్ఫీ దిగుతున్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఓ క్రాంటాక్టు ఉద్యోగి వద్దకు వలంటీరు వెళ్లి ‘నువ్వు కూడా ఫొటో దిగాలి. లేకపోతే ఉద్యోగం నుంచి తొలగించాలని వైసీపీ నాయకులకు చెబుతా..’ అని బెదిరించారు. ఇంటికి కచ్చితంగా వైసీపీ జెండా కట్టి, సెల్ఫీ దిగాలనడంతో సదరు ఉద్యోగి ఆ పని చేయక తప్పలేదు.

Updated Date - 2023-11-17T04:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising