ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

ABN, First Publish Date - 2023-07-30T03:19:48+05:30

భారత్‌ను 2047 నాటి కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్నోవేషన్‌, సమ్మిళిత వృద్ధి (4ఐ)పై దృష్టి సారించిందని...

‘4ఐ’లపై ప్రభుత్వం ఫోకస్‌.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటి కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్నోవేషన్‌, సమ్మిళిత వృద్ధి (4ఐ)పై దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇందుకు అనుగుణంగానే అవసరమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం పెట్టుబడులకు సంబంధించి పలు కీలక సంస్కరణలను తీసుకువచ్చిందని మంత్రి పేర్కొన్నారు. భారత్‌లో యువ రక్తానికి కొదవలేదని, వీరి నైపుణ్యాలకు మరింత పదును పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి పథంలోకి తీసుకువెళ్లే అవకాశం లభిస్తుందన్నారు.

రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాల కల్పనపై రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. ఈ మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలోని పెట్టుబడులు వస్తాయన్నారు. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కాకుండా డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కల్పనపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వీటితోపాటు ఇన్నోవేషన్‌కు పెద్ద పీట వేస్తున్నామని, ఇందులో భాగంగా అంతరిక్షం, న్యూక్లియర్‌ ఎనర్జీ తదితర రంగాలపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న.. చేపట్టబోయే పనులతో వచ్చే పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలువనుందన్నారు.

Updated Date - 2023-07-30T03:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising