జీఓసీఎల్ లాభంలో 61% క్షీణత
ABN, First Publish Date - 2023-11-08T02:04:17+05:30
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో జీఓసీఎల్ కార్పొరేషన్ ఏకీకృత ప్రాతిపదికన రూ.223.42 కోట్ల ఆదాయంపై రూ.15.71 కోట్ల నికర లాభాన్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో జీఓసీఎల్ కార్పొరేషన్ ఏకీకృత ప్రాతిపదికన రూ.223.42 కోట్ల ఆదాయంపై రూ.15.71 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.40.37 కోట్లు)తో పోల్చితే లాభం 61 శాతం తగ్గగా, ఆదాయం (రూ.319 కోట్లు) 30 శాతం క్షీణించింది. ముడి పదార్ధాల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ప్రభావంతో ఆదాయం, లాభం తగ్గిందని కంపెనీ పేర్కొంది.
Updated Date - 2023-11-08T02:04:20+05:30 IST