ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అదానీ షేర్లు జిగేల్‌

ABN, First Publish Date - 2023-11-29T01:53:11+05:30

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పుంజుకున్నాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (ఏటీజీఎల్‌) షేరు ఏకంగా 20 శాతం...

రూ.లక్ష కోట్లు పెరిగిన గ్రూప్‌ మార్కెట్‌ విలువ

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పుంజుకున్నాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (ఏటీజీఎల్‌) షేరు ఏకంగా 20 శాతం పెరిగింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ 19.06 శాతం, అదానీ పవర్‌ 12.32 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 12.27 శాతం, ఎన్‌డీటీవీ 11.73 శాతం, అదానీ విల్మర్‌ 9.96 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 8.66 శాతం, అదానీ పోర్ట్స్‌ 5.20 శాతం, అంబుజా సిమెంట్స్‌ 4.22 శాతం, ఏసీసీ 2.62 శాతం లాభపడ్డాయి. కొనుగోళ్ల హోరులో గ్రూప్‌లోని 10 కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (విలువ) ఒక్క రోజులో రూ.లక్ష కోట్లకు పైగా పెరిగి రూ.11.31 లక్షల కోట్లకు చేరుకుంది. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన పలు పిటిషన్లపై గత వారాంతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, కోర్టు తీర్పు అదానీకి అనుకూలంగా రావచ్చన్న అంచనాల నేపథ్యంలో మదుపర్లు ఈ గ్రూప్‌ కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.

Updated Date - 2023-11-29T01:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising