Airtel: ఎయిర్‌టెల్ వినియోగదారులకు లక్కీ చాన్స్!
ABN, First Publish Date - 2023-03-19T19:11:50+05:30
ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel) గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది
న్యూఢిల్లీ: ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel) గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది. రూ. 239 ఆపైన యాక్టివ్ డేటా ప్లాన్ కలిగిన వారందరికీ ఇది వర్తిస్తుంది. ఈ అపరిమిత 5జీ డేటా(5G Data)ను ప్రారంభ ఆఫర్‌గా అందిస్తోంది. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల్లోని వినియోగదారులు ఈ ప్రయోజనం పొందొచ్చు.
ఎయిర్‌టెల్ థ్యాంక్స్(Airtel Thanks) యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్‌టెల్ పట్టుదలగా ఉంది. తర్వాతి తరం వైర్‌లెస్ బ్రాడ్‌బ్రాండ్ సేవల వైపు వినియోగదారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ అపరిమిత 5జీ డేటా ఆఫర్‌ను పరిచయం చేసింది. చందాదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి ‘క్లెయిమ్ అన్‌లిమిడెట్ 5జీ డేటా’పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందొచ్చు.
ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. కనీసం రూ. 239 యాక్టివ్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ఉన్న ప్రీపెయిడ్ వినియోగదారులు దీనికి అర్హులని పేర్కొంది. రీచార్జ్ తర్వాత ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. పోస్టుపెయిడ్ వినియోగదారులైతే ప్రతి నెల బిల్ జనరేట్ అయ్యే సమయంలో దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు.
రిలయన్స్ జియోకు పోటీగా..
రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రూ. 2,999 ప్లాన్‌ను 365 రోజుల కాలపరిమితితో తీసుకొచ్చింది. ఇందులో హైస్పీడ్ 5జీ డేటా లభిస్తుంది. ఇప్పుడు దీనికి పోటీగానే ఎయిర్‌టెల్ ఉచితంగా 5జీ డేటాను అపరిమితంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ జనవరిలో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రకటించింది. వీటిలో 60 జీబీ డేటా 30 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. వీటి ధరలు రూ. 489, రూ. 509. వీటిలో అపరమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌ల వంటి ప్రయోజనాలతోపాటు వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్, పాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ వారం మొదట్లో హైస్పీడ్ 5జీ సర్వీసులను 125 నగరాల్లో లాంచ్ చేసింది. దీంతో ఎయిర్‌టెల్ 5జీ కవరేజీ ఉన్న నగరాల సంఖ్య 265కి పెరిగింది.
Updated Date - 2023-03-19T19:11:50+05:30 IST