Amazon and Vodafone Layoffs: టెలికం దిగ్గజం వొడాఫోన్‌లో 11వేల మంది ఉద్యోగుల తొలగింపు.. అదే బాటలో అమెజాన్..
ABN, First Publish Date - 2023-05-16T16:07:24+05:30
సాఫ్ట్‌వేర్ రంగం తరహాలోనే టెలికం రంగం కూడా ఉద్యోగుల తొలగింపు బాటలో సాగుతోంది. తాజాగా బ్రిటన్ టెలికాం దిగ్గజం వోడాఫోన్(British Telecom Giant Vodafone) భారీ సంఖ్యలో ఉద్యోగులను ..
లండన్: సాఫ్ట్‌వేర్ రంగం తరహాలోనే టెలికం రంగం కూడా ఉద్యోగుల తొలగింపు బాటలో సాగుతోంది. తాజాగా బ్రిటన్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ (British Telecom Giant Vodafone) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్లు(Vodafone Layoffs) ప్రకటించింది.
వచ్చే మూడేళ్లలో దాదాపు 11 వేల ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు వొడాఫోన్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్గెరిటా డెల్లా (Chief Executive Margherita Della) మంగళవారం ప్రకటించారు. కంపెనీ కార్యకలాపాల తగ్గింపులో భాగంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నామని కొత్త చీఫ్ మార్గెరిటా అన్నారు.
కంపెనీ ఆదాయం ఆశించిన స్థాయిలో లేదని మార్గెరిటా తెలిపారు. స్థిరమైన వృద్ధిని సాధించడం కోసం కంపెనీలో మార్పులు చేయాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడమే సంస్థ తొలి ప్రాధాన్యతనిస్తూ ఉన్న వనరులను నాణ్యమైన సేవలను అందించేందుకు అనుగుణంగా కేటాయిస్తామని పేర్కొన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరాల్లో తమ పెట్టుబడులను సైతం పునర్‌వ్యవస్థీకరిస్తామని వొడాఫోన్ తెలిపింది. అలాగే ఉద్యోగుల తొలగింపు, ఇతర దేశాల్లో వ్యాపారాన్ని సులభతరం చేయడం వంటి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
అమెజాన్‌లో 500 మంది...
మరోవైపు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులకు ఉద్యాసన పలికినట్లు((Amazon Layoffs) తెలుస్తోంది. అంతర్జాతీయంగా తమ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 9,000 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నట్లు మార్చిలో అమెజాన్ (Amazon Layoffs) ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానేభారత్‌లో 500 మందిని ఇంటికి పంపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
వెబ్ సర్వీసెస్, హ్యూమన్ రీసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగులను తొలగించినట్లు (Amazon Layoffs) తెలుస్తోంది. వీరిలో కొంత మంది కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్‌కు ఇక్కడి నుంచి పనిచేస్తున్న వారున్నా రు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత కారణంగానే ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయించినట్లు సీఈఓ ఆండీ జస్సీ ఇంతకు ముందే ప్రకటించారు.ి
Updated Date - 2023-05-16T17:14:16+05:30 IST