ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏఎం గ్రీన్‌ చేతికి ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ అమ్మోనియా వ్యాపారం

ABN, First Publish Date - 2023-08-16T03:18:43+05:30

నాగార్జునా ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ (ఎన్‌ఎ్‌ఫసీఎల్‌) జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.805 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఏడా ది క్రితం ఇదే కాలం నష్ఠం రూ.142.33 కోట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది...

  • డీల్‌ విలువ రూ.1,365 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నాగార్జునా ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ (ఎన్‌ఎ్‌ఫసీఎల్‌) జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.805 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఏడా ది క్రితం ఇదే కాలం నష్ఠం రూ.142.33 కోట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం రూ.1,505 కోట్ల నుంచి రూ.1,075 కోట్లకు తగ్గింది. కాగా రూ.1,365 కోట్ల నగదుకు అమ్మోనియా/యూరియా, మైక్రో ఇరిగేషన్‌ (ఎంఐ) వ్యాపారాలను ఏఎం గ్రీన్‌ అమ్మోనియా (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించాలని ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ బోర్డు నిర్ణయించింది. దీంతోపాటు ఏఎం గ్రీన్‌ ఆమ్మోనియాలో 19.7 శాతం వాటాను పొందుతుంది. మొత్తం విలువ దాదాపు రూ.1,700 కోట్లు అవుతుంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఈ వ్యాపారాలను వీటికి సంబంధించిన ఆస్తులు, ఆప్పులను విక్రయిస్తున్నట్లు ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ పేర్కొంది. విక్రయం ద్వారా లభించిన నిధులతో వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎ్‌స)కింద రూ.1,500 కోట్ల రుణాలను ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ చెల్లిస్తుంది. గ్రీన్‌కో గ్రూప్‌నకు చెందిన ఏఎం గ్రీన్‌ ఆమ్మోనియాను 2013లో ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-08-16T03:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising