ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘తూర్పు’ వైపు అపోలో చూపు

ABN, First Publish Date - 2023-12-03T02:04:19+05:30

కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న దేశ తూర్పు ప్రాంతంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.

ఇతర కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ సైతం అదే బాట

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న దేశ తూర్పు ప్రాంతంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తమ విస్తరణ వ్యూహాల్లో భాగంగా కొత్త ఆసుపత్రుల నిర్మాణాలను చేపట్టడం, ఉన్న ఆసుపత్రులను కొనుగోలు చేయడం చేస్తున్నాయి. విస్తరణలో భాగంగా అపోలో హాస్పిటల్స్‌ తూర్పు ప్రాంతానికి విస్తరిస్తోంది. కోల్‌కతాలో ఇటీవల నిర్మాణంలో ఉన్న 325 పడకల ఆసుపత్రిని కొనుగోలు చేసింది. కోల్‌కతాలో అపోలోకు ఇది రెండో ఆసుపత్రి. తూర్పు ప్రాంతంలో అపోలోకు భుశనేశ్వర్‌, గువహటి, కోల్‌కతాల్లో మొత్తం 5 ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 1,800 పడకల సామర్థ్యం ఉంది. వచ్చే మూడేళ్లలో మరో 700 పడకలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తూర్పు ప్రాంతం నుంచి అపోలో ఆరోగ్య సేవల ఆదాయం 18.4 శాతం పెరిగింది.

కార్పొరేట్‌ హాస్పిటల్స్‌తో పాటు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు కూడా తూర్పు ప్రాంత ఆసుపత్రుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. వైద్య సేవల రంగం విస్తరణకు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాయి. దేశంలో ప్రధానమైన హాస్పిటల్స్‌ చెయిన్‌ మణిపాల్‌ హాస్పిటల్స్‌ పశ్చిమ బెంగాల్‌, తూర్పు ప్రాంత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి విస్తరించనున్నట్లు పేర్కొంది. మరో కార్పొరేట్‌ హాస్పిటల్‌ మెడికా హాస్పిటల్‌ కూడా తూర్పు ప్రాంతంలో కొత్త ఆసుపత్రులపై పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ రెండు హాస్పిటల్స్‌ దాదాపు రూ.1,400 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాయి. ఇతర కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ కూడా ఈ ప్రాంతానికి విస్తరించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాయి. తూర్పు ప్రాంతంలో కనీసం మూడు ఆసుపత్రులను ప్రారంభించాలని, 1,000 పడకల సామర్థ్యాన్ని అదనంగా సమకూర్చుకోవాలని మణిపాల్‌ హాస్పిటల్స్‌ యోచిస్తోంది. ప్రస్తుతం మణిపాల్‌ హాస్పిటల్స్‌కు ఇక్కడ 2,000 పడకలు ఉన్నాయి.

Updated Date - 2023-12-03T02:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising