మార్కెట్‌పై బేర్ పట్టు
ABN, First Publish Date - 2023-10-26T02:20:07+05:30
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య పోరు తద్వారా ఏర్పడిన రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్‌ను వరుసగా ఐదో రోజున కూడా నష్టాల బాటలో నడిపించాయి. ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లలో...
5 సెషన్లలో రూ.14.60 లక్షల కోట్లు ఫట్
సెన్సెక్స్ మరో 523 పాయింట్లు డౌన్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య పోరు తద్వారా ఏర్పడిన రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్‌ను వరుసగా ఐదో రోజున కూడా నష్టాల బాటలో నడిపించాయి. ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో బుధవారం సెన్సెక్స్ మరో 522.82 పాయింట్లు క్షీణించి 64,049.06 వద్దకు జారుకుంది. నిఫ్టీ 159.60 పాయింట్లు కోల్పోయి 19,122.15 వద్ద ముగిసింది. గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,379 పాయింట్లు, నిఫ్టీ 690 పాయింట్లు పతనమవగా.. మార్కెట్ సంపద రూ.14.60 లక్షల కోట్లకు పైగా తరిగిపోయి రూ.309.22 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నష్టపోగా.. ఇన్ఫోసిస్ షేరు 2.76 శాతం క్షీణించి టాప్ లూజర్‌గా మిగిలింది. ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఇండ్‌సఇండ్ బ్యాంక్ షేర్లు ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయాయి. టాటా స్టీల్ మాత్రం ఒక శాతానికి పైగా లాభపడింది. బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సూచీ 0.77 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే.. టెక్నాలజీ, టెలికాం, యుటిలిటీస్, ఐటీ, పవర్ సూచీలు ఒక శాతానికి పైగా క్షీణించాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83, బ్యాంకెక్స్ 0.70 శాతం తగ్గాయి. మెటల్ సూచీ మాత్రమే లాభపడింది.
ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు కోల్పోయి రూ.83.18 వద్ద ముగిసింది. డాలర్ బలోపేతం, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు ఇందుకు కారణమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధర ఒక దశలో 88 డాలర్ల ఎగువన ట్రేడైంది. కాగా, ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం 1,988 డాలర్లు, వెండి దాదాపు 23 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
31 నుంచి మామాఎర్త్ ఐపీఓ
మామాఎర్త్, డెర్మా కో వంటి పర్సనల్ కేర్ ఉత్పత్తుల బ్రాండ్ల యాజమాన్య సంస్థ హోనాసా కన్జ్యూమర్ లిమిటెడ్ ఐపీఓ ఈనెల 31న ప్రారంభమై వచ్చేనెల 2న ముగియనుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.365 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు, వాటాదారులకు చెందిన 4.12 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనుంది. కాగా, బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఐపీఓ తొలి రోజు ముగిసేసరికి, ఇష్యూ సైజులో 69 శాతానికి సమానమైన బిడ్లు దాఖలయ్యాయి.
Updated Date - 2023-10-26T02:20:07+05:30 IST